జబర్దస్త్ కి రాకముందు ‘ఆది’ ఎన్ని లక్షల జాబ్ చేసేవాడో తెలుసా?
ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఆ కార్యక్రమం TRP రేటింగ్స్ లో అగ్ర స్థానంలో ఉంటుంది. జబర్దస్త్ పేరు వినగానే హైపర్ ఆది గుర్తుకు వస్తాడు. తన స్కిట్ మొత్తం పంచ్ లతో నింపేసాడు. ఆది స్కిట్ ని YOUTUBE లో అప్లోడ్ చేయగానే లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తాయి. అంటే హైపర్ ఆది స్కిట్స్ కి ఎంత మంచి అంభిమానులు ఉన్నారో అర్ధం అవుతుంది. అలాంటి ఆది ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు. హైపర్ ఆదికి సంబందించిన వివరాల్లోకి వెళ్ళితే… ఆది ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామంలో జన్మిచాడు.
వ్యవసాయ కుటుంబమని చెప్పాడు. కందుకూరులోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో 2012లో బీటెక్ పూర్తి చేసిన తనకు టీసీఎస్ లో జాబ్ వచ్చిందన్నారు. ఐటీ ఎంప్లాయిగా టీసీఎస్ లో రెండేళ్లు జాబ్ చేసిన తర్వాత అసంతృప్తితో తన జాబ్ కు రిజైన్ చేసినట్లు చెప్పాడు. తాను జాబ్ కు రిజైన్ చేసేటప్పుడు ఐదు లక్షల రూపాయిల ప్యాకేజీని వదులుకొని మరీ.. టాలెంట్ ను ఫ్రూవ్ చేసుకోవాలని ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పాడు.
ఉద్యోగం మానేశాక రెండు షార్ట్ ఫిలింస్ చేయగా.. అనుకోకుండా జబర్దస్త్ లో తనకు ఛాన్స్ వచ్చిందన్నాడు. 2016లో ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఇప్పుడు తాను జబర్దస్త్ లో టీం లీడర్ అయ్యానన్నారు. ప్రస్తుతం 100 స్కిట్ లను పైనే జబర్దస్త్ లో కంప్లీట్ చేసినట్లు చెప్పాడు.
నవ్వించటంలోని మజాను చెబుతూ.. ఒక రియల్ ఉదంతాన్ని ప్రస్తావించాడు. ఒక వ్యక్తి చాలా రోజులుగా వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని.. ఎన్ని మాత్రలు వేసుకున్నా అతని సమస్య తీరలేదని.. అలాంటిది ఒక రోజు జబర్దస్త్ చూశాడని.. చాలాసేపు నవ్వకున్నాడన్నారు.
అలా కొద్దిరోజులు షో చూస్తూ నవ్వుకుంటూ ఉండటంతో అతని సమస్య తీరిపోయినట్లు చెప్పాడు. ఇది కల్పించింది కాదని.. నిజంగా జరిగిందన్నాడు. ప్రతిభ ఉంటే ఎలా అయినా బతికేయొచ్చని.. కష్టపడే తత్త్వం ఉంటే ఏ రంగాన్ని ఎంచుకున్నా సక్సెస్ పక్కా అన్నారు.