Movies

బిగ్ బాస్ హౌస్ రెంట్ రోజుకి ఎన్ని లక్షల్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

బిగ్ బాస్ మొదటి సీజన్ సెట్ ని పూణేలో వేశారు. వారంలో రెండు రోజులు ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి హోస్ట్ చేసేవాడు. అయితే రెండో సీజన్ కి వచ్చేసరికి బిగ్ బాస్ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. మూడో సీజన్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుంది.  బిగ్ బాస్ హౌస్ మరియు బిగ్ బాస్ స్టేజ్ అంతా అన్నపూర్ణ స్టూడియోలోనే వేశారు. నాగార్జునకు స్టార్ మా టివి వారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ ఒప్పందం జరిగిందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున బిగ్ బాస్ హౌస్ సెట్ కోసం స్టార్ మా టివి నుండి అద్దె రూపంలో భారీగానే వసూలు చేస్తున్నాడట. బిగ్ బాస్ షో సెట్ కోసం స్టార్ మా టివి వారు అన్నపూర్ణ స్టూడియోకి రోజుకి అద్దె రూపంలో 6 లక్షల వరకు చెల్లిస్తున్నారట.

షో వంద రోజుల కోసం అన్నపూర్ణ స్టూడియో వారితో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ షో పూర్తి అయ్యాక ఈ సెట్ ని తొలగిస్తారట. అంతేకాక బిగ్ బాస్ నాలుగు,ఐదు సీజన్ లకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, రెండో సీజన్ కి ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేసాడు. ఇక మూడో సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."