Movies

మహేష్ ఎప్పుడూ నీలి రంగు దుస్తుల్లోనే కనిపిస్తాడు…ఆ సీక్రెట్ ఏమిటో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన నటుడు మహేష్ బాబు. ఈ మాట అన్నది ఎవరో కాదు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మరో అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘భారత్ అను నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ మహేష్ బాబు వంటి హీరో చాలా రేర్ అని ఆయన్ని అలాగే ఉండనివ్వాలని సూచించారు. ఎన్టీఆర్ లాంటి హీరో ఆ మాట అన్నాడంటే మహేష్ బాబు ప్రత్యేకత అర్ధం అవుతుంది. మహేష్ బాబులో మరొక కోణం కూడా ఉంది. అది సేంట్ మెంట్ అనండి లేదా సైంట్ ఫిక్ రీజన్ అనండి. మహేష్ బాబు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు నీలి రంగు దుస్తులను ధరించి వస్తాడు. అది కూడా చాలా లైట్ కలర్స్ ని ప్రిఫర్ చేస్తాడు ఈ అమ్మాయిల రాకుమారుడు.

నీలి రంగు,ఊదా రంగు మిక్స్ద ఫాబ్రిక్ తో మహేష్ ఎంత సింపుల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయని మహేష్ సన్నిహితులు అంటున్నారు. ఒకరకంగా మహేష్ కి నీలి రంగు సేంట్ మెంట్ కావచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

మరొక కాదనలేని రీజన్ ఏమిటంటే మహేష్ సైంటిఫిక్ మరియు హెల్త్ టిప్స్ ని బాగా పాటిస్తాడట. ఆపిల్ పండులాగా మెరిసిపోయే రంగుని తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుండి వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడు. మరి దాన్ని కాపాడుకోవాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అందుకే పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు సూర్యకాంతి నుండి చర్మ సౌందర్యాన్ని రక్షించుకొనేందుకు లేత రంగు దుస్తులు ధరిస్తాడట. అది నీలి రంగులను మాత్రమే ధరిస్తాడు. సినిమా వేడుకలంటే స్టేజ్ మీద విపరీతమైన లైటింగ్ ఉంటుంది.

లైటింగ్ కారణంగా వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సినీ వేడుకలకు వచ్చినప్పుడు కూడా నీలి రంగు దుస్తులనే ధరిస్తాడట.శరీరం మీద ప్రమాదకరమైన UV కిరణాల ప్రభావం పడకుండా నీలి రంగుతో పాటు తెల్లని దుస్తులు కూడా కాపాడతాయని సైంటిఫిక్ గా కూడా రుజువు అయింది.
మహేష్ నీలి రంగు సేంట్ మెంట్ తో ఆ దుస్తులనే వేసుకుంటాడట.మహేష్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టే అప్పటికి ఇప్పటికి సుకుమారుడుగానే ఉన్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."