- అమ్మవారి ఫోటో – అమ్మవారు నిల్చొని ఉండకూడదు. అమంవారికి ఇరువైపుల ఏనుగులు ఉండేలా చూస్కోండి
- చిన్న పీట
- బియ్యం పిండి
- పీట మీద ముగ్గు వేయటానికి మరియు చనిమిడి చేయటానికి
- పెసరపప్పు 100 గ్రాములు
- వడపప్పు కోసం- పెసరపప్పును నీటిలో రెండు గంటలు నానబెట్టాలి. వడపప్పు,చనిమిడి నైవేద్యంగా పెడితే చాలా మంచిది.
- బెల్లం – పానకం కోసం మరియు నైవేద్యం కోసం – అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం. పానకంలో వేయటానికి మూడు యాలకులు,మూడు మిరియాల గింజలు
- పసుపు కొమ్ములు 2
- పసుపు 100 గ్రాములు – పసుపుతో గణపతిని చేస్తాం.అలాగే కొంతమంది పసుపు గౌరమ్మను కూడా చేస్తారు
- కుంకుమ 100 గ్రాములు
- గాజులు 12 – అమ్మవారి దగ్గర పెట్టటానికి
- చీర – నలుపు రంగు లేకుండా చూసుకోవాలి
- బ్లౌస్ పీస్ లు – 2 ఒకటి అమ్మవారికి రెండోవది కలసానికి
- గంధం
- పువ్వులు
- పువ్వులు ఎన్ని ఎక్కువ ఉంటె అంత మంచిది. ఎందుకంటే అమ్మవారికి అస్తోత్రం,సహస్రనామాలతో పూజ చేస్తాం కదా . అలాగే 108 పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది
- పూల మాలలు 2 – తెలుపు రంగు పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఒకటి అమ్మవారికి,రెండోవది కలసానికి
- తమలపాకులు 30 అమ్మవారికి,గణపతికి తాంబూలం సమర్పిస్తాం. ఒక్కో తాంబూలానికి మూడు ఆకులను పెడతాం
- వక్కలు లేదా వక్కపొడి
- అగరబత్తీ
- చిల్లర 30 రూపాయిలు రూపాయి కాయిన్స్
- మామిడి ఆకులూ
- అరటిపండ్లు మరియు పండ్ల రకాలు
- కలశం కోసం చెంబు
- కొబ్బరి కాయలు 2 -ఒకటి కలశం కోసం మరొకటి అమంవారి నైవేద్యం కోసం
- బియ్యం 2 కేజీలు – బియ్యం మీద కలశం పెడతాం,అలాగే వినాయకుని పూజకు బియ్యం అవసరం అవుతాయి
- అక్షింతలు – కొంచెం బియ్యంలో పసుపు,నెయ్యి వేసి అక్షింతలను తయారుచేసుకోవాలి
- తెల్ల దారం – తోరం కట్టటానికి
- పిండి వంటలు
- ఆవుపాలు – అమ్మవారికి గేదెపాలు సమర్పించకూడదు. ఆవుపాలు మాత్రమే సమర్పించాలి.
- వరలక్ష్మీదేవి వ్రత పుస్తకం
- దీపం కుందులు 2 దీపారాధన చేయటానికి
- గంట
- హారతి ప్లేట్
- పంచపాత్ర ఉద్దరిని
- నూనె లేదా నెయ్యి
- వత్తులు
- అగ్గిపెట్టె
- కర్పూరం
- kalasam వరలక్ష్మి వ్రతానికి కావలసిన అతి ముఖ్యమైన పూజ సామాగ్రి. వీటిని ఈ రోజే సిద్ధం చేసుకొని రేపు వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్దలతో చేసుకోండి
https://www.chaipakodi.com/