Devotional

అయ్యప్ప దీక్షకు అన్ని నియమాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

అయ్యప్ప దీక్షలో చన్నీళ్ళ స్నానము,నెల మీద పడుకోవటం, ఒంటి పూట భోజనం,చెప్పులు లేకుండా నడవటం,బ్రహ్మచర్యం పాటించటం, మద్యమాంసాదులుమసాలా దినుసులు వంటి తామసకారకాలైన వాటిని వదిలేటం వంటి నియమాలను ప్రతి ఒక్కరు పాటించవలసిందే.అయ్యప్ప దీక్షను తీసుకునేవారు గురు స్వామి దగ్గర నుంచి తులసి,రుద్రాక్ష మాలను ధరించటం,నుదిటిన చందనం, విభూతి ధరిస్తారుఈ విధంగా ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

రెండు పూటల చన్నీటి స్నానము చేయటం వలన మనస్సు ప్రశాంతంగా ఉంది భగవంతుని ఆరాధనలో ఏకాగ్రత కుదురుతుంది.తులసి పూసల నుంచి వెలువడే గాలి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రుద్రాక్ష రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది.ఇక చందనం, విభూతి ధరించటం వలన చక్కటి వర్ఛస్సుధైర్యం, బలం కలుగుతుంది.

ఆహార నియమాలను పాటించటం వలన కోరికలు అదుపులో ఉంటాయి.చెప్పులు లేకుండా నడిస్తే జీవితంలో భక్తులు కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది.రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తులను ధరించాలని నియమం పెట్టారు.నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది.అంతేకాక నరదృష్టి దోషాన్నిపోగొడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."