Movies

మహానటి సావిత్రి రోజు కట్టుకునే చీర ఖరీదు ఎంతో తెలుసా ? ఆమె ఆస్తులు ఇప్పుడు ఎక్కడ వున్నాయి

మహానటి సావిత్రి గారి వైభోగం తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె పారితోషికం కింద ఇంటికి రెండు అంబాసిడర్ కార్లలో నోట్ల కట్టలు వచ్చేవి. ఆమె షూటింగ్ కి రెండు కార్లలో వెళ్ళేది. ఆమె ఇల్లు పెద్ద రాజ్ మహల్ వలే ఉండేది. ఆ రాజ్ మహల్ వెళ్లి దారిలో రెండు వైపులా ఎనిమిది గదులు చొప్పున 16 గదులు ఉండేవి. 16 గదుల్లో 16 కారులు ఉండేవి. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కారును సావిత్రి కొనేది. పది మంది డ్రైవర్స్ ఎప్పుడు రెడీగా ఉండేవారు. అంతేకాక సావిత్రి గారి కారు బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. 25 వేల రూపాయిల చీరలను సావిత్రి కట్టేవారు.

ఒక పక్క మల్లె తోట,మరో పక్క వేట కుక్కలు ఉండేవి. దీపావళి చాలా సంబరంగా చేసుకునేది. తన దగ్గర పనిచేసే వారికీ బహుమతులు ఎక్కువగా ఇచ్చేది.తన పనివారి ఇంటిలో పెళ్లి అయితే చీర,బంగారు తాళిబొట్టు ఇచ్చేది. అదే తన సహా నటుల ఇంటిలో పెళ్లి అయితే వెండి బిందె బహుమానంగా ఇచ్చేది. చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సంపాదించిన నటి సావిత్రి. సావిత్రికి ఏలూరు లో రైస్ మిల్లు,కొడైకెనాల్ లో ఎస్టేట్, హైదరాబాద్,విజయవాడలో ఎన్నో ఆస్తులు,చెన్నైలో ఆస్తులు కోట్లాది రూపాయిల విలువ చేస్తాయి.