Movies

లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సినిమాలకు దూరంగా ఏమి చేస్తుందో తెలుసా?

రిచాగంగోపాధ్యాయ్‌ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నాగవల్లి, మిరపకాయ్‌, మిర్చి వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసి మంచి స్థాయిలో ఉంది. అప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది రిచా. ఐదు సంవత్సరాల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్ళిపోయింది. ఆమె అమెరికాలో సెయింట్‌ లూయీలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీలో చేరి గతేడాదే ఎంబీఏ పట్టా పుచ్చుకుంది. అమెరికాలో పుట్టి పెరిగిన రిచాగంగోపాధ్యాయ్‌ సినిమాల మీద ఆసక్తితో చదువుకు బ్రేక్ ఇచ్చి ఇండియా వచ్చి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లి మరల చదువులో పడిపోయింది.

ఆమె అమెరికాలో తన అనుభవాలన్నిటితో బిజినెస్‌ స్కూల్స్‌కి సంబంధించిన న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘పొయెట్స్‌ అండ్‌ క్వాంట్స్‌’లో పెద్ద కథనం కూడా రాసింది. కార్పొరేట్‌ రంగంలో రాణించాలన్నది ప్రస్తుతం రిచా కల అట. ఆ కల దిశగా ఆమె అడుగులు వేస్తుంది. ఆమె కోరుకున్న రంగంలో రాణించాలని కోరుకుందాం.