Movies

బాలీవుడ్ నుంచి వచ్చిన అర్చన తెలుగులో ఎందుకు నటించటం లేదు

రంగుతో పనేముంది టాలెంట్ ఉండాలని నిరూపిస్తూ అవార్డుల మీద అవార్డులు కొట్టేసిన నటి అర్చన అందరికీ గుర్తుండే ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో అందరూ గుర్తుంచుకునేలా చేసింది. ఈమె నవ్వితే నవరత్నాలు ఊడిపడ్డాయా అన్నట్లు ఉంటుంది. తన అద్భుత నటనతో శృంగారానికి,ఓల్గారిటీకి మధ్య గీతను చెరిపేస్తూ,మురిపించడం ఆమె నటనలో నైజం. బాలుమహేంద్ర డైరెక్షన్ లో వచ్చిన నిరీక్షణ సినిమా నుంచి తమిళ మూవీ వీడు వరకూ ఆమె కెమెరా ముందు అసలైన నటన ప్రదర్శించింది. నటిగా వెలుగొందుతున్న సమయంలోనే పెళ్లిచేసుకున్న అర్చన మళ్ళీ వెండితెరవైపు చాలాకాలం చూడలేదు.

తెలుగులో మధురం మూవీతో ఎంట్రీ ఇచ్చి,మరు ఏడాది నిరీక్షణ చేసింది. ఈ సినిమా మొత్తం జాకెట్ లేకుండా నటించడంలోనే అర్చన ప్రతిభ కు అందరూ దాసోహమయ్యారు. బాలుమహేంద్ర కెమెరా పనితనం ముందు ఎక్కడా వల్గారిటీ కనిపించలేదు. తన అద్భుత నటనతో కట్టిపడేసిన నల్లకలువ ఆమె. ఈసినిమాలో స్పెషల్ జ్యురి నంది అవార్డు కొట్టేసింది. లేడీస్ టైలర్ కూడా భిన్నమైన ఇమేజ్ తెచ్చి పెట్టింది. మంచి కథ దొరికితే సై అంటూ నటిస్తుంది. నటనలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, 1973లో యాదంకి భారత్ హిందీ మూవీలో నటించి,సూపర్ హిట్ అందుకుని,సొంత గడ్డకు వచ్చింది. ఎప్పుడు నచ్చిన పాత్ర వచ్చినా చేస్తూ వచ్చిన అర్చన ఆ మధ్య తమిళంలో తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది. తెలుగులో యోగిగా రీమేక్ చేయగా శారద ఆ పాత్ర పోషించింది.

అందం లేకున్నా,ఆమె కళ్ళతో చేసి నటనతో కళ్ళు చెమర్చేలా చేయడం అర్చన స్పెషాల్టీ. తెలుగులో దాసి,తమిళంలో వీడు మూవీస్ కి జాతీయ అవార్డులు అందుకుంది. బి నర్సింగరావు డైరెక్షన్ లో తెలంగాణా దొరల నేపథ్యంలో వచ్చిన దాసి మూవీలో తన కూతురిని 20రూపాయలకు అమ్మేస్తాడు ఓ తండ్రి. దొరల పాదాల కింద నలిగిపోయిన పాత్రలో అర్చన నటన హైలెట్. పచ్చతోరణం,ఉక్కు సంకెళ్లు,మట్టి మనుషులు,భారత్ బంద్ లాంటి సినిమాలు తెలుగులో చేసిన అర్చన తమిళ ,తెలుగు,బెంగాలీ,మలయాళం ,హిందీ ఇలా అన్ని భాషల్లో చుట్టేసింది. భారత్ బంద్ లో తుపాకీ పక్కన పెట్టుకుని పాఠాలు చెప్పే పవర్ ఫుల్ క్యారెక్టర్ తో అదరగొట్టేసింది.