Movies

వారు చెప్పినట్టు వినలేదు…అందుకే నా జీవితం తలక్రిందులు అయ్యిపోయింది

హీరోగా,విలన్ గా, కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సుధాకర్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించాడు. ఇంటర్ పూర్తయ్యాక సినిమాలపై మోజుతో మద్రాసు వెళ్లి ఫిలిం ఇనిస్టుట్యూట్ లో చేరాడు. భారతీరాజా నటించిన తమిళ చిత్రంలో హీరోగా ఛాన్స్ కొట్టేసాడు. అదే సినిమా బాపు డైరెక్షన్ లో తూర్పు వెళ్లే రైలు గా తెలుగులో తీశారు. దీంతో సుధాకర్ ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. దాదాపు 45తమిళ చిత్రాల్లో హీరోగా రాణించాడు.

రాధికతో అయితే 18సినిమాల్లో హీరోగా చేసాడు. వీళ్లది తమిళనాట మంచి కాంబినేషన్ గా నిల్చింది. ఇక ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ సమయంలో చిరంజీవి,సుధాకర్,హరిప్రసాద్ ,నారాయణ మూర్తి,నారాయణరావు ఒకే రూమ్ లో ఉండేవారు. వీళ్లల్లో ముందు సినీ ఛాన్స్ లు కొట్టేసి హీరో గా రాణించి సుధాకర్ తమిళ నాట సినీ రాజకీయాల్లో ఇమడలేక తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసాడు.

ఊరికి ఇచ్చిన మాట ,భోగిమంటలు వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ ఆతర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా మంచి తెచ్చుకున్నాడు. ‘నేను కమ్యూనిజం భావాలతో ఉండేవాడిని. తమిళనాట రాజకీయాల్లో ఎంజీఆర్ పక్షాన ప్రచారం చేయడానికి పార్టీలో చేరమని పిలుపు వస్తే,తిరస్కరించాను. దాంతో తమిళంలో నేను చేస్తున్న సినిమాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాను. దీంతో నాకు లైఫ్ ఇచ్చిన భారతీరాజా ఇక్కడ ఇలాంటి రాజకీయాలే ఉంటాయి. నువ్వు తెలుగు పరిశ్రమలోకి వెళ్లు. మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు. దీంతో ఇక్కడ నిలబడ్డాను. ఆర్ధికంగా మళ్ళీ ఎదిగాను’అని ఓ ఇంటర్యూలో సుధాకర్ చెప్పుకొచ్చాడు.