Movies

ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఏమి లాభం… ఢీలా పడ్డ వారసులు

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే స్వయంకృషితో పాటు బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండాలి. అయితే కొందరు బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అది మొదటి సినిమాకే పనిచేస్తుంది. ఆతర్వాత వాళ్ళ టాలెంట్ తో ఎదగాలి. కానీ కొందరు ఎంత బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా సక్సెస్ కాలేకపోయారు. అలాంటివాళ్ల వివరాల్లోకి వెళ్తే,సూపర్ కృష్ణ తనయుడి రమేష్ బాబు సామ్రాట్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత ఎన్నో సినిమాలు చేసినా ఇండస్ట్రీలో నిలబడలేదు. మనిషి అందంగా ఉన్నా సరే,ఆడియన్స్ ఎందుకో ఆదరించలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మెగా డాటర్ నిహారిక కి తండ్రి నాగేంద్రబాబు ప్రోత్సాహం ఇవ్వడంతో మూడు సినిమాలు హీరోయిన్ గా చేసినా హిట్ మాత్రం దక్కించుకోలేక పోయింది. హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా సక్సెస్ అనుకోలేకపోయింది.

ఇక నందమూరి వంశం నుంచి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఒక్క రోజులోనే 9సినిమాలు ఒప్పుకున్నాడు. బాలకృష్ణ కూడా సపోర్ట్ చేసాడు. కానీ తొలిసినిమా నుంచే దెబ్బతిన్నాడు. దీంతో ఛాన్స్ లు తగ్గాయి. కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి నీతో అనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. సక్సెస్ రాకపోవడంతో డైరెక్టర్ గా అదృష్టం పరీక్షించుకుని ఇక తప్పుకున్నాడు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ చేసాడు. అయితే ఈ హీరోకి సక్సెస్ లేక తప్పుకున్నాడు.

ఎందరో తారలను పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు తన చిన్నకుమారుడు దాసరి అరుణ్ ని గ్రీకు వీరుడు మూవీతో పరిచయం చేసాడు. పలు సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేకపోయాడు. నిర్మాత వడ్డే రమేష్ తనయుడు నవీన్ కోరుకున్న ప్రియుడు మూవీతో మంచి గుర్తింపు పొంది పెళ్లి సినిమాతో టాప్ రేంజ్ కి వెళ్లినా,ఎక్కువకాలం పోటీలో నిలబడలేకపోయాడు. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తన ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అయితే చిన్నకొడుకు సక్సెస్ అందుకున్నా, పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ ఎక్కువకాలం నిలబడలేదు.

అక్కినేని మనవడు సుమంత్ ఇండస్ట్రీకి వచ్చి ఒకటి రెండు హిట్లు అందుకున్నా హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అల్లు అరవింద్ మూడు కొడుకు శిరీష్ నిర్మాతగా కాకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి,కెరీర్ లో సక్సెస్ సాధించలేదు. అలాగే నాగార్జున తనయుడు అఖిల్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా హిట్ కొట్టలేక పోయాడు.