ప్రేమించిన హీరోస్ కోసం వారి భార్యలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్

సినిమా రంగంలో ఎన్నో వింతలు ఉన్నట్లే ఎన్నో వింత ప్రేమలు కూడా వున్నాయి. అలా పెళ్ళాడి,ఇలా విడాకులు తీసుకోవడం వాళ్లకి పరిపాటే. పెళ్లయిన వాళ్ళను సైతం పెళ్ళాడ్డం కూడా సహజంగా ఇండస్ట్రీలో ఉంది. ఇక పెళ్లయిన వాళ్ళని ప్రేమించి పెళ్ళిచేసుకుని హ్యాపీ గా జీవిస్తున్నవాళ్లూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కృష్ణ ,విజయ నిర్మల జంట ఒకటి. 1961లో తన మరదలు ఇందిరాదేవిని కృష్ణ పెళ్లాడాడు. ఇక 1969లో విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఇందిర కు రమేష్ బాబు జన్మించగా, పద్మావతి కడుపులో ఉంది. ఇక విజయ నిర్మలతో పెళ్ళయాక ఇందిరకు మంజుల,మహేష్ బాబు, ప్రియదర్శిని లు జన్మించారు.

విజయనిర్మలను పెళ్లి చేసుకున్నప్పటికీ ఇందిరకు కృష్ణ అన్యాయం చేయలేదు సరికదా పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పి మరీ చేసుకున్నాడు. అందరూ అన్యోన్యంగానే ఉండేవారు. ఇక మహానటి సావిత్రి విషయానికి వస్తే,అప్పటికే పెళ్లయిన జెమిని గణేశన్ ని ప్రేమించి రహస్యంగా గుళ్లో పెళ్లాడింది. పైగా అప్పటికే పుష్పవల్లితో కూడా జెమినికి సంబంధం ఉండేది. పెళ్లయ్యాక మొదటి పెళ్ళాం అలిమేలుకి విషయం చెప్పడం,ఇద్దరినీ ప్రేమగా చూసుకోవడం జరిగాయి.

అయితే చివరి రోజుల్లో సావిత్రికి జెమిని తోడు లేకున్నా మొదటి భార్య అలిమేలు మాత్రం ఆమెతో సఖ్యతగా ఉంది. అంతిమ సంస్కారాలు కూడా దగ్గరుండి పూర్తిచేయించారు. ఇక మంజుల విషయానికి వస్తే తనతో కల్సి నటించిన తోటి నటుడు విజయకుమార్ ని ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి పెళ్లవడంతో మొదటి భార్య ముత్తు అంగీకారంతో ఇద్దరి పెళ్లి జరిగింది. అందరూ సఖ్యతగానే ఉండేవారు. కల్సి మెలసి తిరిగేవారు. అయితే ఏడాది తర్వాత ముత్తు కన్నుమూయగా, 2013లో మంచం మీద నుంచి కిందపడి మంజుల ఈలోకం వీడింది. ఈవిధంగా ఈ ముగ్గురు హీరోయిన్స్ పెళ్లయిన హీరోలను ప్రేమించి,మొదటి భార్యలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు