Politics

ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే గ్రామ వాలంటీర్ల పేరుతో లక్షలాది ఉద్యోగాలు కల్పించి ఏపీలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాడు.

అయితే తాజాగా ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్తను అందిస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏపీ కార్పోరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అయితే ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా డిసెంబర్ 15 వరకు దరఖాస్తులను తీసుకోనున్నారు. అయితే ఈ ఉద్యోగాలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారీటీలకు అవకాశం కల్పించనున్నారు.