Movies

రోడ్డు ప్రమాదంలో సంపూర్ణేష్ బాబు కి గాయాలు

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి వైవిధ్యమైన సినిమాల ద్వారా కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న సంపూర్ణేష్ బాబు రోడ్డు ప్రమాదానాయికి గురయ్యారు.ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ బస్సు ను ఢీకొనడంతో ఆయన గాయాలపాలయ్యారు.

ఆ సమయంలో కారులో సంపూతో పాటు ఆయన భార్య, కూతురు కూడా కారులోనే ఉన్నారు.వీరు కూడా ఆ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈముగ్గుర్నీ ప్రాధమిక చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ ప్రమాదంపై ఎవరూ కంగారుపడాల్సిన అవసరం ఏమీ లేదని, తాను తన కుటుంభం సభ్యులంతా క్షేమంగా ఉన్నామని సంపూర్ణేష్ బాబు ప్రకటించారు.

స్థానికులు సమాచారంతో ఘ‌ట‌నా స్థలికి చేరుకున్న పోలీసులు సంపూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.ప్రమాదంలో సంపూర్ణేశ్ బాబు కారు స్వల్పంగా ధ్వంసమైంది.ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."