Movies

జబర్దస్త్: హాట్ సీట్‌కి పెరిగిన క్రేజ్.. పోటీ మాములుగా లేదుగా..!

ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే నవ్వుల కార్యక్రమాలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి బుల్లి తెరపై నంబర్‌వన్ ప్రోగ్రాంస్‌గా మంచి టీఆర్పీ రేటింగ్‌ను సంపాదించుకుంటూ ఈ కార్యక్రమాలు నేటికి విజయవంతంగా దూసుకుపోతున్నాయి. అయితే ఈ షోలలో కంటెస్టెంట్లు చేసే కామెడీతో పాటు, జడ్జెస్ రోజా మరియు నాగబాబుల నవ్వుల జల్లులు కూడా ప్రేక్షకులను బాగా అలరించేవి.

అయితే ఇటీవల ఈ షో నుంచి జడ్జ్‌గా నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ హాట్ సీట్ కోసం చాలా మంది సెలబ్రెటీలు పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఒక ఎపిసోడ్‌కు హీరో కార్తికేయను, మరొక ఎపిసోడ్‌కు కమెడీయన్ అలీనీ తీసుకోబోతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ షో నిర్వాహకులు నాగబాబు ప్లేస్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే వారిని ఎంపిక చేయడానికి కసరత్తు చేపట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోజా పక్కన ఎవరిని జడ్జ్‌గా కొనసాగిస్తారనేది మరికొద్ది రోజులలోనే తేలనుంది.