Movies

తమ అక్కల వయసు ఉన్న హీరోయిన్ల తో నటించి హిట్లు కొట్టిన మన టాలీవుడ్ హీరోలు వీరే…

కొన్ని సార్లు హీరోల పక్కన హీరోయిన్స్ గా నటించిన వాళ్ళు వయస్సులో పెద్దగా ఉండడం పరిపాటి. అదేంటి హీరోకి అక్కలా ఉందే అని అందరూ పెదవి విరుస్తారు. అలా అక్కలా కనిపించిన కొందరు హీరోయిన్స్ మన స్టార్ హీరోలతో జతకట్టారు. ఇందులో అగ్ర హీరోలు కూడా ఉన్నారు. శ్రీదేవి ,నాగార్జున కల్సి నటించిన గోవిందా గోవిందా మూవీ చూస్తే, ఇద్దరూ అక్కాతమ్ముల్లుగా అనిపిస్తారు. అలాగే చిరంజీవి,జయసుధ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా మగధీరుడు మూవీ చూస్తే,ఇద్దరూ అక్కా తమ్ముళ్ళుగా అయితే బావుణ్ణు అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ కేరీర్ మొదట్లో సుస్వాగతం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫ్యామిలీ పాత్రలకు సరిపోయే దేవయాని ఈ మూవీలో పవన్ సరసన నటించడంతో హీరోకి అక్కగా ఉందని అనుకున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఇందులో హీరోయిన్ గా చేసిన అనూ మెహతా కూడా బన్నీకి అక్కగా ఉన్నట్టు ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు మూవీలో ఎంతో యంగ్ గా ఉంటాడు. అయితే అతడి సరసన అప్పటికే హీరోయిన్ గా రాణిస్తున్న సిమ్రాన్ నటించడంతో వీరిద్దరూ అక్కా తమ్ముళ్లుగా అయితే బాగుంటుందన్న కామెంట్స్ వచ్చాయి. సింహాద్రి మూవీలో హీరోయిన్ భూమికతో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసాడు. అయితే వీళ్ళిద్దరూ చూడ్డానికి అక్కా తమ్ముళ్లుగా కనిపించారు. తరుణ్ హీరోగా ప్రియమైన నీకు మూవీ ఉంది కదా. అందులో స్నేహ హీరోయిన్ గా వేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ వీరిద్దరూ అక్కాతమ్ముళ్లను తలపించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."