షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన టాప్ హీరోల సినిమాలు… ఎవరికి తెలియని విశేషాలు
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అనుకున్నా ఎందుకో ఆగిపోతాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోతాయి. మరికొన్ని పూర్తయినా రిలీజ్ కి నోచుకోవు. ఇందులో అగ్ర హీరోల మూవీస్ కూడా ఉంటాయి. మొదట్లోనే ఆగిపోతే పర్వాలేదు గానీ,కొంత షూటింగ్ అయ్యాక ఆగితే ప్రొడ్యూసర్ కి చాలా నష్టమే. ఇలాంటి సినిమాల వెనుక ఆసక్తికర అంశాలు పరిశీలిస్తే,1997లో మెగాస్టార్ చిరంజీవి,రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వినాలని ఉంది అనే టైటిల్ తో అశ్వినీదత్ నిర్మాతగా సినిమా స్టార్ట్ అయింది. టబు హీరోయిన్. రెండు పాటలు చిత్రీకరించారు.
ఇక స్క్రిప్ట్ విషయంలో చిరంజీవితో విబేధాలు రావడం,స్క్రిప్ట్ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే సినిమా అయినా వదిలేసే వర్మ ఈ సినిమాను వదిలేసాడు. అయితే సంజయదత్ మూవీ కోసం ఈ సినిమా వర్మ వదిలేసినట్లు ప్రచారం జరిగింది. అయితే షూట్ చేసిన పాటలను 1998లో చూడాలని వుంది సినిమాలో వినియోగించారు.
ఇక ఇంగ్లిష్ తో సహా 5భాషల్లో అబూబ్ బాగ్దాద్ గజదొంగ మూవీని చిరంజీవి హీరోగా స్టార్ట్ అయిన మూవీ బడ్జెట్ కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. అలాగే సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో భూలోక వీరుడు అనే సినిమా చిరంజీవి హీరోగా స్టార్ట్ అయింది. అయితే అవుట్ ఫుట్ సరిగ్గా రావడం లేదని చిరు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
అంతేకాదు కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి,శ్రీదేవి కాంబినేషన్ లో మొదలైన వజ్రాల దొంగ అనే సినిమా కొన్ని సీన్స్ తర్వాత స్క్రిప్ట్ లో లోపాల కారణంగా ఆగిపోయింది . ద్రౌపది పాత్రధారి సౌందర్య మరణంతో ఇక బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తన శాల మూవీ మధ్యలోనే ఆగిపోయింది. అలాగే బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో విక్రమ సింహ భూపతి మూవీ 75శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ బాలయ్య,కోడి రామకృష్ణ మధ్య చిన్న గొడవ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.
బాలయ్య హీరోగా బి గోపాల్ డైరెక్షన్ లో హర హర మహాదేవ సినిమా కొంచెం షూటింగ్ అయ్యాక నిలిచిపోయింది. బాలయ్య మిలట్రీ ఆఫీసర్ గా నటించాల్సిన సముద్ర డైరెక్షన్ లోని సినిమా ఓపెనింగ్ సీన్ తో ఆగిపోయింది. బి గోపాల్ డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా బావమరిది సినిమా స్టార్ట్ అయింది. అయితే ఇందులో శోభన్ బాబు పాత్ర అంతగా నచ్చకపోవడంతో డ్రాప్ అవ్వడం వలన మధ్యలో నిలిచిపోయింది. విజయశాంతి ,కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో అడవి రాణి మూవీ షూటింగ్ జరుగుతున్నాక ఎందుకనో మధ్యలో ఆగిపోయింది.
అలాగే వెంకీ హీరోగా వంశీ డైరక్షన్ లో గాలిపురం స్టేషన్ మూవీ 4రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. అలాగే ఇటీవల మారుతి డైరెక్షన్ లో రాధా అనే మూవీ చేయాల్సిన వెంకీ స్క్రిప్ట్ నచ్చక పక్కన పెట్టేసాడు. అలాగే తేజ డైరెక్షన్ లో వెంకీ హీరోగా స్టార్ట్ అయిన సావిత్రి మూవీ ఇద్దరి మధ్యా విబేధాల కారణంగా ఆగిపోయింది. సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా మిస్టర్ పెర్ఫెక్ట్ మూవీ ఓపెనింగ్ షాట్ తో ఆగిపోయింది.
నువ్వేకావాలి పేరిట సినిమా రైట్స్ వెళ్లిపోవడంతో చెప్పాలని ఉంది పేరుతొ పవన్ కళ్యాణ్ హీరోగా కొంత భాగం సినిమా తీసాక ఆగిపోయింది. అలాగే పవన్ స్వీయ డైరెక్షన్ లో సత్యాగ్రహి మూవీ ఎందుకనో ఆగిపోయింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కుర్రాడు మూవీ,రవితేజ పవర్ మూవీ,నాగచైతన్య దుర్గ మూవీ , హలొ బ్రదర్ మూవీ ఎందుకనో ఆగిపోయాయి.

