Movies

ప్రభాస్‌ పెళ్లిపై ఆయన సిస్టర్స్‌ చెప్పిన ఆసక్తికర విషయం ఏంటో తెలుసా?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.దాదాపుగా నాలుగు పదుల వయసు వచ్చింది.అయినా కూడా ప్రభాస్‌ మాత్రం పెళ్లి గురించిన ఆలోచన చేయడం లేదు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత అయిదు సంవత్సరాలుగా పెళ్లి గురించి వార్తలు జోరుగా వస్తున్నాయి.ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

మిర్చి సినిమా విడుదల తర్వాత ప్రభాస్‌ సినిమా అన్నారు.ఆ తర్వాత బాహుబలి సినిమా మొదలు పెట్టాడు.భారీ సినిమా అవ్వడం వల్ల ఆ సినిమా పూర్తి అయిన తర్వాతే పెళ్లి అన్నాడు.బాహుబలి మొదటి పార్ట్‌ అయిన తర్వాత పెళ్లి అన్నారు.మొదటి పార్ట్‌ విడుదలై రెండవ పార్ట్‌ కూడా విడుదలైంది.అయినా పెళ్లి చేసుకోలేదు.సాహో మొదలు పెట్టాడు.సాహో తర్వాత పెళ్లి అన్నారు.కాని సాహో అయ్యింది ఇప్పుడు జాన్‌ కూడా పూర్తి కాబోతుంది.అయినా పెళ్లి ప్రస్తావనే లేదు.

ఈ సమయంలోనే కృష్ణంరాజు కూతురు.ప్రభాస్‌ సోదరి ఈ విషయమై స్పందించింది.ప్రభాస్‌ పెళ్లి గురించి సన్నిహితుల వద్ద ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అన్నయ్య ప్రభాస్‌ కోసం అమ్మాయిని వెదికాం.వచ్చే ఏడాది ఖచ్చితంగా అన్నయ్య పెళ్లి చేసుకుంటాడంటూ ఆమె చెప్పింది.అయితే అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుందనే విషయమై ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.కృష్ణం రాజు స్వయంగా అమ్మాయిని ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."