Movies

బాలయ్య ఫాన్స్ కాలర్ ఎగరేసే సినిమాలు ఏమిటో తెలుసా?

నటరత్న ఎన్టీఆర్ తో కల్సి ఎన్నో సినిమాలు చేసిన బాలయ్య ఆతర్వాత ఎన్టీఆర్ వారసునిగా చేసిన సినిమాలు ఆయన కెరీర్ ని మలుపు తిప్పాయి. అభిమానులకు పండగ,ప్రొడ్యూసర్స్ కి కనకవర్షం లా బాలయ్య వెలిగాడు. అయితే 1984లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మంగమ్మగారి మనవడు బాలయ్య కెరీర్ ని అనూహ్యంగా మలుపు తిప్పింది. 1989లో వచ్చిన ముద్దుల మావయ్య మూవీ బాలయ్య సినిమాల్లో మైలురాయిగా నిల్చింది. కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో 1990లో వచ్చిన నారీ నారీ నడుమ మురారి కామెడీ రొమాంటిక్ మూవీ ఆడియన్స్ ని అలరించడంతో పాటు కమర్షియల్ గా హిట్ అందుకుంది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీ డ్రైవర్ మూవీతో బాలయ్య రేంజ్ అమాంతం పెరిగింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ సైన్టిఫిక్ మూవీ ఆదిత్య 369 అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. 1994లో సింగీతం డైరెక్షన్ లోనే వచ్చిన భైరవ ద్వీపం మూవీ బాలయ్య నట జీవితంలో అద్భుత ప్రేమ కావ్యంగా అపూర్వ విజయాన్ని సాధించింది.

అయితే బి గోపాల్ డైరెక్షన్ లో1999లో వచ్చిన సమరసింహారెడ్డి మూవీ బాలయ్యను మాస్ హీరగా నిలబెట్టింది. అద్భుతమైన ఫ్యాక్షన్ కథతో వచ్చిన ఈ మూవీ అన్ని రికార్డ్స్ ని తిరగరాసి, బాలయ్య సినీ చరిత్రను మార్చేసింది. 2001లో మళ్ళీ బి గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య చేసిన యాక్షన్ మూవీ నరసింహనాయుడు బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. బోయపాటి ,బాలయ్య కాంబో లో వచ్చిన సింహా మూవీ బాలయ్యలో యాక్షన్ హీరోని తట్టిలేపింది. బోయపాటి డైరెక్షన్ లోనే వచ్చిన లెజెండ్ మూవీ నిజంగా బాలయ్యను లెజెండ్ గా నిలబెట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."