Movies

భారతీయుడు చిత్రానికి హీరో వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి…???

అవినీతికి పాల్పడిన కన్న కొడుకుని సైతం వదిలిపెట్టని తండ్రి పాత్రలో కమల్ హాసన్ నటిస్తూ తీసిన భారతీయుడు మూవీ అప్పట్లో ఓ సంచలనం. అందుకే ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ తీస్తున్నాడు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఈ మూవీ ఎంపిక చేసుకున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండియన్ మూవీకి సీక్వెల్ అవ్వడం,కమల్ హీరో కావడం,దర్శకుడు శంకర్ కావడం ఇవన్నీ సినిమా రేంజ్ ని పెంచేసాయి. అయితే సీక్వెల్స్ మన దగ్గర పెద్దగా విజయం సాధించకపోవడం, ఇండియన్ వన్ స్థాయిలో ఈ మూవీ ఉంటుందా వంటి ప్రశ్నలు ఈ సినిమా అంచనా మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఈమధ్య వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రోబో 2.0 కలెక్షన్స్ బాగున్నా,కథ పరంగా శంకర్ స్థాయిలో లేదన్న టాక్ కూడా వచ్చింది. నిజానికి డైరెక్టర్ గా కన్నా దృఢమైన కథలు రచించడంలో శంకర్ అందెవేసిన చేయి అని అందరూ ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద ఇండియన్ 2మూవీ గురించి చూస్తే,కాజల్ అగర్వాల్ ,కమల్ చేస్తున్న తొలిమూవీ,అలాగే శంకర్ ,కమల్ కల్సి 23ఏళ్లతర్వాత చేస్తున్న మూవీ,ఇక లైకా ప్రొడక్షన్స్ కమల్ తీస్తున్న మొదటి చిత్రం ఇలా ఇండియన్ 2గురించి ఎన్నో విశేషాలున్నాయి.

జనవరి 18నుంచి షూటింగ్ మొదలు కానుంది. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఆడియన్స్ ముందుకు తేవాలని శంకర్ ప్రత్నిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2స్టిల్స్ కూడా కమల్ తో తీశారు. అయితే ఇండియన్ వన్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన వసంత బాలన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. మొదట భారతీయుడు రజనీ దగ్గరకు వచ్చిందని అయితే డేట్స్ కుదరనందున కమల్ వద్దకు వెళ్లిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అలాగే తండ్రి పాత్రలో డాక్టర్ రాజశేఖర్, కొడుకు పాత్రలో విక్టరీ వెంకటేష్, నాగార్జున పేర్లు పరిశీలనలోకి వచ్చాయని, చివరకు కమల్ ఒకే చెప్పక రెండు పాత్రలు ఆయనే చేసారని చెప్పాడు. ఇప్పుడు సీక్వెల్ కి మొగ్గు చూపడం మంచిదేనని అంటున్నాడు.