Movies

నటుడు గొల్లపూడి మారుతీ రావు గురించి బయటపడ్డ ఎవరికీ తెలియని నిజాలు.

గొల్లపూడి మారుతీ రావు అనగానే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరి మదిలో మెదులుతారు. దాదాపు 250సినిమాల్లో నటించారు. 6సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 1939ఏప్రియల్ 14న విజయనగరం లో జన్మించారు. చిన్న నాటి నుంచి కళా రంగంపై మక్కువ పెంచుకున్నారు. కాలేజీ రోజుల్లోనే నవలలు,నాటకాలు రాసి,మంచి పేరుతెచ్చుకున్నారు. తొలి బహుమతిగా 100రూపాయలు అందుకున్నట్లు ఆయన ఓ ఇంటర్యూలో గతంలో చెప్పుకొచ్చారు. 16,17సంవత్సరాల వయస్సులో అనంతం నాటకం రాసి,వేశారు.

అయితే అప్పట్లో నాటకం వృత్తులు కానందున రాబడి పెద్దగా వచ్చేది కాదని గొల్లపూడి తన ఇంటర్యూలో చెప్పారు. స్థానం నరసింహారావు,బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి,మాధవపెద్ది వెంకట్రామయ్య వంటి మహామహులకు మాత్రమే నాటకాలు వేయడం చెల్లిందని ఆయన అనేవారు. నాటకాలు అంటే పెద్దలు ఒప్పుకునేవారు కాదని,అయితే ఇంటర్ కాలేజీ పోటీల్లో తన నాటకం ఉత్తమ రచనగా ఎంపికైందని, అప్పటి కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి చేతులమీదుగా ఢిల్లీలో 100రూపాయల బహుమతి అందుకున్నట్లు ఆయన చెప్పారు. అలా వందరూపాయలు నా జీవితాన్ని మార్చేసి,ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చేలా చేసిందని అనేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో ఉండగా రాజీనామా చేసారు.

కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెరంగేట్రం చేసిన మారుతీరావు అనకుముందు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా ,జర్నలిస్టుగా కొంతకాలం పనిచేసారు. యముడికి మొగుడు,ప్రేమ,మనిషికో చరిత్ర,స్వాతిముత్యం,ఆలయ శిఖరం, త్రిసూలం,ఆదిత్య 369,కంచె,సైజ్ జీరో,మనమంతా, జోడీ లాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసిన గొల్లపూడి పలు టివి సీరియల్స్ లో నటించారు. 1996లో ఉత్తమ టెలివిజన్ నటుడిగా నంది పురస్కారం దక్కించుకున్నారు.