Movies

ఒకప్పటి ఈ యాంకర్ గుర్తుందా? ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు

టీవీల్లో యాంకర్స్ వ్యవస్థ వచ్చాక చాలామంది వచ్చి వెళ్లారు. సుమ లాంటి వాళ్ళు ఇంకా ఏలుతున్నారు. కానీ కొందరు ఎక్కడ ఎలా ఉన్నారో తెలీదు. అందులో యాంకర్ జాహ్నవి ఒకరు. ఆమె జెమిని టివిలో డాన్స్ బేబీ డాన్స్ షోలో యాంకర్ గా అదరగొట్టింది. ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రాం తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు యజ్ఞం మూవీలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలో ముస్లిం యువతిగా వేసిన జాహ్నవి పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ వేసింది.

డైరెక్టర్ గా,ఫోటోగ్రాఫర్ గా పేరుతెచ్చుకున్న రసూల్ ఎల్లోరా ప్రేమలో పడిన జాహ్నవి గురించి అప్పట్లో అందరూ చర్చించుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలోనే అతడితో ప్రేమలో పడిన ఈమె పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లాయ్యాక సినీ,టివి రంగాలకు దూరంగా వెళ్ళిపోయింది. ఒకప్పుడు బొద్దుగా లావుగా ఉండే జాహ్నవి ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా ఉంది.

ఈమెకు పదేళ్ల కొడుకు ఉన్నాడంటే ఎవరూ నమ్మరు కూడా. కాస్యూమ్స్ డిజైనర్ గా ఎవరు సినిమాలో రేజీనాకి డిజైన్ చేసింది జాహ్నవి కావడం విశేషం. హీరోయిన్స్ అందంగా కనపడేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న జాహ్నవి ఒకప్పుడు తెరముందు ఉంటె,ఇప్పుడు తెరవెనుక ఉంటోంది.