Movies

శ్రీముఖి,రవికి మధ్య గొడవ రావటానికి కారణం ఎవరో తెలుసా?

ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్యతో షో ఆపేసిన తర్వాత యాంకర్ రవికి పర్ఫెక్ట్ జోడీ గా శ్రీముఖి దొరికింది. వీల్లద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. అందుకే శ్రీముఖి, రవి.. ఈ ఇద్దరూ కలిసి చేసిన పటాస్ స్టాండప్ కామెడీ షో రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటి వరకు ఈటీవీ ప్లస్ అనే ఛానెల్ అనేది ఎవరికి పెద్దగా తెలియకపోయినా కూడా పటాస్ షోతో బాగా పాపులర్ అయిందని అంటుంటారు.

రెండేళ్ల పాటు ఈ షోను విజయవంతంగా ఈ ఇద్దరూ రన్ చేసారు. ఉన్న‌ట్లుండి శ్రీముఖి కొన్ని ప్ర‌త్యేకమైన కార‌ణాల దృష్ట్యా త‌ప్పుకోవ‌డం ప‌టాస్ షోపై తీవ్ర ప్ర‌భావం చూపించి, రేటింగ్స్ కూడా ప‌డిపోయాయి. బిగ్ బాస్ సీజ‌న్ 3లో ఆమె కంటెస్టెంట్‌గా వెళ్లడం వలన ఆమె తప్పుకుందనుకున్నారు కానీ దానికి ముందే వేరే ఇష్యూ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఈమె తప్పుకున్న తర్వాత ఇప్పుడు రవి కూడా బయటికి వచ్చేసాడు.

నిజానికి రవితో గొడవల కారణంతోనే శ్రీముఖి బయటికి వచ్చేసిందని ప్రచారం జోరందుకుంది. ఈ యాంకర్ దీనిపై స్పందిస్తూ ఈ మధ్యే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చాడు. శ్రీముఖి మంచి అమ్మాయని, అద్భుతమైన కో యాంకర్ అని కితాబిచ్చేశాడు. తాను పటాస్ నుంచి బయటికి వచ్చింది శ్రీముఖి వచ్చినందుకు కాదని, పర్సనల్ రీజన్స్‌తోనే అని వివరించాడు. శ్రీముఖి కంటే ముందే ఆ షో డైరెక్టర్ సంతోష్ కూడా మానేసాడని.. శ్రీముఖి కూడా బిగ్ బాస్ కమిట్మెంట్ కోసం బయటికి వచ్చేసిందని చెప్పుకొచ్చాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."