10 రూపాయిల నుండి 10 కోట్ల రెమ్యునరేషన్ వరకు రవితేజ ప్రస్థానం
తెలుగు సినిమా రంగంలో ఎవరి అండా లేకుండా,టాలెంట్ తో టాప్ రేంజ్ కి చేరుకున్న రవితేజ గురించి తెలుసుకుంటే స్ఫూర్తిగా ఉంటుంది. 10రూపాయల రెమ్యునరేషన్ నుంచి పదికోట్ల రేంజ్ కి ఎదిగాడు. దీనికి కారణం కష్టపడే తత్త్వం, టాలెంట్,చేయూతనిచ్చినవారికి సాయమందించే వ్యక్తిత్వం ఇలా సుగుణాల వలన రవితేజ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యాడు. సినిమాలో హీరో అవుదామని 1988లో చెన్నై వెళ్లిన రవితేజ ఏడాదిపాటు ఖాళీగానే గడిపాడు. తనకు పరిచయమైన డైరెక్టర్స్ వైవిఎస్ చౌదరి,గుణశేఖర్ లతో కల్సి వాళ్ళ రూమ్ లో ఉన్నాడు. ఇంటినుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో చిన్న చిన్న వేషాలు వేసి, 10రూపాయల పారితోషికం తీసుకునేవాడు. గుణశేఖర్ సిఫార్స్ తో కర్తవ్యం మూవీలో చిన్న పాత్ర ధరించాడు.
సినిమాలో పేరంటూ రాకపోయినా , ఆ వేషం కారణంగా ఓ సర్కిల్ ఏర్పడింది. కృష్ణవంశీ వంటివాళ్ళు పరిచయం కావడంతో చిన్న చిన్న ఛాన్స్ లు వచ్చాయి. డబ్బులు లేకపోవడంతో కృష్ణవంశీ సూచన మేరకు గులాబీ,అనగనగా ఒకరోజు మూవీస్ కి అప్రెంటిస్ గా చేసి, 1996లో నిన్నే పెళ్లాడతా మూవీకి, పూరి జగన్నాధ్ తో కల్సి అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరాడు. దీంతో పూరికి,రవికి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇక కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన సింధూరం మూవీలో ఒక హీరోగా రవి చేసాడు. మనసిచ్చి చూడు మూవీలో రవి చేసిన నటన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన మొదటి మూవీలో నీకే ఛాన్స్ అన్నాడు.
చెప్పినట్టుగానే నీకోసం మూవీలో రవికి శ్రీను వైట్ల ఛాన్సిచ్చాడు. ఆతర్వాత పూరి జగన్నాధ్ వరుసగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,ఇడియట్,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీస్ లో హీరోగా ఇచ్చిన ఛాన్స్ లు రవి కెరీర్ ని మలుపు తిప్పాయి. ఇక కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఖడ్గం మూవీ రవి ట్రెండ్ ని మార్చేసింది. విక్రమార్కుడు,కిక్,కృష్ణ వంటి మూవీస్ తో ఎలాంటి పాత్రకైనా రవి సూటవుతాడని తేలింది. ఎదిగిన తర్వాత తనను ఆదుకున్న వాళ్లకు సాయం చేసాడు. పూరి జగన్నాధ్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ ఇచ్చాడు. గుణశేఖర్ తీసిన నిప్పు మూవీకి రవి రెమ్యునరేషన్ తీసుకోలేదు. కృష్ణ వంశీకి ప్రొడ్యూసర్స్ లేనప్పుడు డివివి దానయ్యను ఇచ్చాడు. శ్రీను వైట్ల కష్టంలో ఉంటె అమర్ అక్బర్ ఆంటోని మూవీ చేసాడు.

