Business

కోస్టా కాఫీ టెస్ట్ చేస్తున్న అతడి నాలుకకు ఇన్సూరెన్స్,ఎంతో తెలుసా?

మామూలుగా ఒక మనిషికి ఇన్సూరెన్స్ అనగానే లైఫ్ ఇన్సూరెన్స్ అనే విషయం ఠక్కున గుర్తుకు వస్తుంది.అయితే కేవలం ఒక్క అవయవానికి ఇన్సూరెన్స్ చేస్తారు అన్న విషయం మీకు తెలుసా.నిజంగా మనశరీరం లో బాడీ పార్ట్శ్ కు ఇన్సూరెన్స్ కల్పించే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందట, అయితే అది ఇండియా లో కాదు గానీ లండన్ లో ఉందట.ప్రపంచంలో మనుషుల బాడీ పార్ట్‌లకు ఇన్సూరెన్స్ కల్పించే ఏకైక ఇన్సూరెన్స్ కంపెనీ లాయిడ్.ఇది లండన్ లో ఉంటుంది.అయితే ఈ కంపెనీ ఒక సెలబ్రిటీ నాలుకకు ఇన్స్యూరెన్స్ చేసింది.జెన్నారో పెల్లీక్కియా కూడా తన నాలికకు 2009లో ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు.

అతని నాలిక విలువను రూ.92 కోట్లుగా డిసైడ్ చేసింది అతను పనిచేస్తున్న కంపెనీ.అంత రేటు ఎందుకూ అన్న వివరాల్లోకి వెళితే….కోస్టా సోదరులు1971లో మోచా ఇటాలియా కాఫీ బ్లెండ్ తయారుచేశారు.దాన్ని బ్రిటన్‌లోని బ్రాండ్ కోస్టా కాఫీ షాప్‌లో అమ్మారు.ప్రస్తుతం ఆ కాఫీ పొడి జెన్నారో దగ్గరకు వస్తుంది.అతని టీం కాఫీలను తయారుచేస్తుంది.ప్రతీ కాఫీనీ సెలబ్రిటీలకు ఇచ్చే ముందు జెన్నారో టేస్ట్ చేస్తూ ఉంటాడు.అయితే ప్రతి కాఫీ ని టెస్ట్ చేసి ఏమాత్రం టెస్ట్ తేడా వచ్చినా వెంటనే రాజీపడకుండా వెనక్కి పంపించేస్తాడట.అందుకే ఆయన నాలిక ను రూ.92 కోట్లకు డిసైడ్ చేసింది అతడు పనిచేస్తున్న కంపెనీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."