Movies

టాలీవుడ్ లో సంచలనం అవుతున్న హీరోయిన్ శాన్వి కన్నీటి గాధ..అసలేం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళాగవు ..?

ఏడాది కాలంగా ఛాన్స్ లు రాకపోవడంతో లవ్లీ హీరోయిన్ శాన్వి శ్రీ వత్సవ బహిరంగంగా కన్నీరు పెట్టుకుని ఛాన్స్ కోసం నోరుతెరచి అడిగిందట. అవును ఒక్క ఛాన్స్ కూడా రాకపోవడంతో ఏంచేయాలో తెలియడం లేదట. లేడీ డైరెక్టర్ బి .ఏ .జయ టాలీవుడ్ కి శాన్విని పరిచయం చేసింది. సాయికుమార్ కొడుకు ఆది హీరోగా లవ్లీ అనే సినిమా డైరెక్ట్ చేసిన సందర్బంగా శాన్వి కి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా పర్వాలేదనిపించింది.

తర్వాత అడ్డా సినిమాలోనూ అలాగే మంచు విష్ణు నటించిన రౌడీ మూవీలోనూ ఛాన్స్ లు వచ్చాయి. అక్కడ నుంచి శాన్వి కి ఆఫర్స్ లేకుండా పోయాయి. ఎన్నో ఆశలతో వచ్చిన ఈ అమ్మడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అందం,టాలెంట్ ఉంటె చాలదు,లక్ కూడా ఇండస్ట్రీలో కల్సి రాకపోతే వ్యర్ధమే కదా. అయితే రక్షిత్ చెట్టి హీరోగా నటిస్తున్న అతడే శ్రీమన్నారాయణ మూవీలో ఛాన్స్ వచ్చింది. రక్షిత్ చెట్టి ఎవరంటే రష్మిక మందన తో బ్రేక్ అప్ చెప్పేసిన హీరో.

ఇక ఈ మూవీని కన్నడంలో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రమోషన్ లో భాగంగా లవ్లీ శాన్వి కంటతడి పెట్టడంతో అందరూ అవాక్కయ్యారు. నిజాయితీగా శాన్వి చెప్పడం అందరిని ఆలోచింపజేసింది. మనసులో ఏదీ దాచుకోకుండా కన్నీటి పర్యంతమైన ఈ అమ్మడికి ఇప్పటికైనా టాలీవుడ్ లో ఛాన్స్ లు ఇస్తారా లేదా అనేది చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."