Health

మధ్యాహ్నం పడుకోండి….బిపికి అదే మందు

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? పగటిపూట కాసేపు కునుకు తీసి చూడండి. ఇది రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. కునుకుతో ఉత్సాహం పెరగటంతో పాటు మూడ్‌ సైతం మెరుగవుతుంది. అయితే రక్తపోటు విషయంలో ఇతరత్రా జీవనశైలి మార్పుల మాదిరిగానే కునుకూ అలాంటి ప్రభావమే చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

రక్తపోటు 2 ఎంఎం హెచ్‌జీ తగ్గినా గుండెపోటు వంటి సమస్యల ముప్పు 10% వరకు తగ్గుతుందని.. అందువల్ల తాజా అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని పేర్కొంటున్నారు. పగటిపూట గంటల కొద్దీ పడుకోమని ప్రోత్సహించటం తమ ఉద్దేశం కాదు గానీ అధిక రక్తపోటు బాధితులు కునుకుతో లభించే ప్రయోజనాలను కోల్పోయామే అని బాధపడకూడదని భావిస్తున్నామని వివరిస్తున్నారు.