Movies

ఈ స్టార్ హీరోల ప్రభావంతో ఎదగలేకపోయిన అద్భుతమైన నటులు

సినీ ఇండస్ట్రీకి చాలామంది నటులు వస్తారు. అయితే టాలెంట్ ఉన్నా నిలదొక్కుకోలేక వెనుకబడిపోయిన హీరోలు ఉన్నారు. అందులో ప్రధానంగా కాంతారావు ఒకరు. జానపద ,పౌరాణిక చిత్రాలతో హీరోగా కాంతారావు నటించి మెప్పించారు. అయితే పౌరాణికి చిత్రాలతో ఎన్టీఆర్ దూసుకుపోవడంతో ఆ ప్రభావం కాంతారావుపై పడింది. దాంతో స్టార్ హీరో కాలేకపోయాడు. రాముడు,కృష్ణుడు పాత్రలతో అలరించిన హీరో హరనాధ్ కూడా ఎన్టీఆర్ ప్రభావం ముందు నిలబడలేకపోయారు.

నటుడు మురళీమోహన్ దూసుకుపోతున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ ప్రభావం పడడంతో కొన్ని పాత్రలకే ఆయన పరిమితమయ్యాడు. సుమన్ పేరు ఇండస్ట్రీలో బాగా మారుమోగుతున్న దశలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. దాంతో సుమన్ వెనుకబడ్డాడు. దీనికితోడు సుమన్ వ్యక్తిగత కారణాలు కూడా సుమన్ ని దెబ్బతీశాయి. అదేసమయంలో చిరు కెరీర్ భానుచందర్ ని కూడా దెబ్బతీసింది. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేష్ బాబు మొదట్లో హిట్ చిత్రాలు చేసాడు. కానీ బాలయ్య ఇమేజ్ పెరగడంతో రమేష్ వెనుకబడిపోయాడు.

ఆరోజుల్లో ఒకవైపు చిరంజీవి దూసుకెళ్తుంటే, వినోదాత్మక చిత్రాలతో నరేష్ హీరోగా ఎదిగాడు. అయితే నాగార్జున,వెంకటేష్ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో నరేష్ వెనుకబడ్డాడు. అబ్బాస్ అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అబ్బాస్ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయాడు. లవర్ బాయ్ గా పలుచిత్రాలతో దూసుకెళ్తున్న తరుణ్ గ్రాఫ్ సడన్ గా పడిపోయింది. ఇక ఉదయ కిరణ్ ఎమోషనల్ ప్రమే కథా చిత్రాలతో దూసుకెళ్లాడు. అయితే ఇతడి కెరీర్ పడిపోడానికి చాలా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆత్మహత్యతో జీవితం విషాదంగా ముగిసింది. కొన్ని తరహా చిత్రాలకే పరిమితం కావడం వలన వడ్డే నవీన్ కెరీర్ పోయింది. రాజేంద్రప్రసాద్ తర్వాత హీరోగా పేరుతెచ్చుకున్న వేణు,వ్యక్తిగత కారణాల వలన ఎక్కువ కాలం హీరోగా నిలబడలేక కామెడీ రోల్స్ కి పరిమితం అయ్యాడు.