Movies

ఎప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన టాలీవుడ్ 5 సినిమాలు ఇవే

భారతీయ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతియేటా భారీగానే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. దాదాపు 90ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర గల తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటిదాకా ఎన్నో గర్వించే సినిమాలు తెలుగులో వచ్చాయి. అందులో కీలకమైన 5 సినిమాలను ప్రస్తావించుకుందాం. ఇప్పటికీ ఈ సినిమాలకు క్రేజ్ ఉంది. బి.నాగిరెడ్డి నిర్మించిన ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు,సావిత్రి,రేలంగి వెంకట్రామయ్య,తదితరులు నటించిన మాయాబజార్ మూవీ కెవి రెడ్డి దర్శకత్వంలో వచ్చింది. ఘంటసాల మ్యూజిక్ డైరెక్టర్ గా చేసారు.

ఇక వేదాంతం రాఘవయ్య డైరెక్షన్ లో వచ్చిన దేవదాసు మూవీ లో అక్కినేని,సావిత్రి,చంద్రముఖి,ఎస్వీ రంగారావు,చిలకలపూడి సీతారామాంజనేయులు,దొరసాని,పేకేటి శివరాం తదితరులు నటించారు. సీఆర్ సుబ్బారావు స్వరాలూ సమకూర్చిన ఈ సినిమాను డిఎల్ నారాయణ నిర్మించారు. పౌరాణిక చిత్రాల రారాజు ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించి నటించడమే కాదు,డైరెక్షన్ చేసి, నిర్మించిన మూవీ దాన వీర సూర కర్ణ లో జయప్రద,రాజనాల,ప్రభాకరరెడ్డి, కైకాల సత్యనారాయణ,గుమ్మడి వెంకటేశ్వరరావు, హరికృష్ణ,బాలకృష్ణ ,శారద,జెపి శర్మ,చలపతిరావు ,జగ్గారావు తదితరులు నటించారు.

అల్లూరి సీతారామరాజు మూవీ ని వి. రామచంద్రరావు డైరెక్ట్ చేసారు. సూపర్ స్టార్ కృష్ణ,జగ్గయ్య,గుమ్మడి,రావుగోపాలరావు,విజయ నిర్మల,చంద్రమోహన్, కాంతారావు, పండరీ భాయి,బాలయ్య,రాజబాబు, ప్రభాకరరెడ్డి తదితరులు నటించారు. కృష్ణ వందవ సినిమా తెరకెక్కిన ఈ సినిమాను పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. ట్రెండ్ సెట్టర్ గా ఈ సినిమా నిల్చింది. మెగాస్టార్ చిరంజీవి,అందాలతార శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసారు. వైజయంతి మూవీ పతాకంపై సి అశ్వినీదత్ నిర్మించారు. అమ్రిష్ పురి,ప్రభాకరరెడ్డి,షాలిని,బ్రహ్మానందం,అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. యాక్షన్,డ్రామా ,ఎంటర్ టైనర్ అయిన ఈమూవీ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది.