Movies

2019లో ప్రేమలో బ్రేక్ అప్ లు ఎక్కువే

సినిమావాళ్లు ప్రేమించుకోవడం,ఆతరువాత విడిపోవడం మామూలే. అయితే ఈ ఏడాది చాలామంది ప్రేమలో పడ్డారు. డేటింగ్ చేసారు. పెద్దలతో చెప్పి పెళ్లిపీటలెక్కారు. పెళ్లయ్యాక ఇద్దరి మధ్యా పొసగక విడాకులు తీసుకున్నారు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరని చెప్పాలి. అయితే ఆ ఇంట్లో నుంచి విడాకుల వ్యవహారం బయట పడింది.

ప్రణతి రెడ్డ్డి అనే ఆమెను పెద్దల అంగీకారంతో2015మే లో ప్రేమ వివాహం చేసుకున్న మంచు మనోజ్ ఆతర్వాత కెరీర్ పరంగా సినిమాలు ప్లాప్ అయ్యాయి. మానసికంగా డిస్టర్బ్ అయ్యాడు. ఇక ఇద్దరి మధ్యా మనస్పర్థలు పెరిగాయి. దీంతో ఆమె నుంచి విడాకులు పొందినట్లు మనోజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో ఛాన్స్ లు తగ్గడంతో బాలీవుడ్ కి మారింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రో తో ప్రేమలో పడింది. డేటింగ్ చేసింది. అన్ని చోట్లా ఈ జంట దర్శనమిచ్చేది. సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలు షేర్ చేసేది. మరి ఏమైందో ఏమో గానీ ఇద్దరు బ్రేక్ అప్ చెప్పేసుకున్నారు.

కొత్త బంగారులోకం మూవీతో హాట్ టాపిక్ గా మారిన శ్వేతా బసు ప్రసాద్ ఆతరువాత వ్యభిచారం కేసుతో చిక్కుల్లో పడింది. అయితే ఫ్రెండ్ రోహిత్ ని పెళ్లాడింది. కానీ ఏడాది గడవకుండానే ఇద్దరు విడిపోయారు. కమల్ కూతురు శృతి హాసన్ లండన్ కి చెందిన మైఖేల్ కోర్సే తో డేటింగ్ చేసింది. సినిమాలు కూడా తగ్గించుకుంటూ వచ్చింది. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. కమల్ తో కల్సి ఆ మధ్య ఓ ఫంక్షన్ కి మైఖేల్ ని సాంప్రదాయ పంచెకట్టుతో తీసుకెళ్లడం చర్చకు దారితీసింది. ఇద్దరికీ పెళ్లే తరువాయి అనుకుంటున్నా తరుణంలో బ్రేక్ అప్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."