Movies

కమెడియన్ సుధాకర్ ఇప్పుడెలా మారిపోయాడో చూస్తే అసలు గుర్తుపట్టలేరు

అన్ని రసాల్లో హాస్య రసానికి గల స్పెషాల్టీ వేరు. ఎంత అలసటగా ఉన్నా,హాయిగా నవ్వుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. జంధ్యాల మార్క్ లాంటి కామెడీ ఆరోగ్యానికి ఎంతోమంచింది. అందుకే సినిమాల్లో నవ్వించడానికి ఎందరో కమెడియన్స్ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే, టాలివుడ్ లో దాదాపు 70మంది కమెడియన్స్ ఉన్నారు. ఇందులో ఒకప్పుడు టాప్ కమెడియన్ గా నిల్చిన సుధాకర్ హాస్యానికి తనదైన మార్క్ తెచ్చాడు. కడుపుబ్బా నవ్వించేవాడు. అయితే అతడి పరిస్థితి చూస్తే,చాలా దయనీయంగా మారింది.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సుధాకర్ తండ్రి డిప్యూటీ కలెక్టర్ గా చేసేవారు. తండ్రి గంగ బాల రత్నం ఉద్యోగం వలన తరచూ బదిలీ కావడంతో రాష్ట్రమంతటా తిరిగారు. కర్నూల్ జిల్లా కోయిలకుంట్లలో పుట్టిన సుధాకర్ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 50కి పైగా సినిమాల్లో చేసాడు. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి టాప్ కమెడియన్ అయ్యాడు. దాదాపు 600మూవీస్ లో చేసాడు. మెగాస్టార్ చిరంజీవికి సినిమాల్లో రూమ్ మేట్ అయిన సుధాకర్ నాలుగు సినిమాలు నిర్మించాడు. హిందిలో కూడా ఎంట్రీ ఇచ్చి నటించాడు.

ఒకప్పుడు ఎందరినో నవ్వించిన సుధాకర్ 2010లో జూన్ 29న అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చేరి,కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కోలుకున్నాడు. అయితే ఎవరూ ఇప్పుడు సుధాకర్ ని పట్టించుకోవడం లేదు. అయితే ఆమధ్య ఒక మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసాడు. ‘ఒరే నాన్నా..’ అంటూ తండ్రిని ముద్దు ముద్దుగా తిట్టడం,పితుహు వంటి డైలాగులు చెప్పి నవ్వించడం ఒక్క సుధాకర్ కే దక్కుతుంది. తమిళ ,తెలుగు ఇండస్ట్రీలలో ఓ వెలుగు వెలిగిన సుధాకర్ విలక్షణ కామెడీకి పెట్టింది పేరు. మళ్ళీ ఛాన్స్ లిస్తే మునుపటిలా నవ్విస్తానని అంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."