Movies

30 ఇయర్స్‌ పృథ్వీ కెరీర్‌ ముగిసినట్లేనా?

సినిమాల్లో 30 ఇయర్స్‌ పృథ్వీ బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో నిలిచిన విషయం తెల్సిందే.కమెడియన్‌గా మాంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే వైకాపా జెండా పట్టుకున్నాడు.జగన్‌ వెంట నడిచాడు.వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ మంచి మనసుతో పృథ్వీకి టీటీడీ భక్తి ఛానెల్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడం జరిగింది.అధికార పార్టీ అండదండలతో ఇండస్ట్రీకి చెందిన వారిపై పృథ్వీ కామెంట్స్‌ చేయడం మొదలు పెట్టాడు.దాంతో ఆయన సినిమాలకు దూరం అయ్యాడు.ఇండస్ట్రీలో ఈమద్య ఆయనకు అసలు ఆఫర్లే కరువయ్యాయి.అయినా కూడా పదవి ఉంది కదా అని నిశ్చింతగా ఉన్నాడు.

కాని ఆమద్య అమరావతి రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరియు ఫోన్‌ సంభాషణలు బయటకు రావడంతో చైర్మన్‌ పదవి పోయింది.ఇదే సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో కూడా చెడ్డ పేరు వచ్చింది.దాంతో పృథ్వీ రెంటికి చెడ్డ రేవడి పరిస్థితి అయ్యింది.రాజకీయ జీవితం నాశనం అయ్యింది.అలాగే సినిమా కెరీర్‌ ఇప్పటికే ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.ఈ పరిస్థితుల్లో పృథ్వీ ఏం చేస్తాడో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."