సుమన్ తో ఫైట్ లో అతని 5 పళ్ళు రాలిపోయాయ్… ఆ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో ఉన్న ఎందరో సీనియర్ మోస్ట్ నటులలో యాక్షన్ హీరో సుమన్ కూడా ఒకరు.ఒక్క యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా మంచి హ్యాండ్సమ్ హీరోగా కూడా సుమన్ ప్రసిద్ధి. ప్రస్తుతం సినిమాలతో అలా జీవనం కొనసాగిస్తున్న సుమన్ ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం 170 వ ఎపిసోడ్ కు ముఖ్య అతిధిగా వచ్చారు.ఇప్పుడు ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో వీడియో బయటకు వచ్చింది.ఇందులో సుమన్ కొన్ని హాట్ హాట్ టాపిక్స్ తో పాటు తాను ఎదుర్కొన్న లవ్ ప్రపోజల్స్ కోసం కూడా చెప్పారు.
“తాను బయటకు కనిపించేంత సాఫ్ట్ అయితే కాననీ తన పేరు సుమన్ “తల్వార్” లాగే లోపల వేరే కూడా ఉందని కాస్త సీరియస్ గానే చెప్పారు.అంతే కాకుండా ఈ టైం లో అంటే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కానీ అప్పటి ట్రెండ్ లో అయితే తన కోసం అమ్మాయిలు రక్తంతో లవ్ లెటర్స్ రాసి పంపేవారని అన్నారు.అలాగే అప్పట్లో యాక్షన్ సినిమాలు అంటే సుమన్ పెట్టింది పేరు దానిని దృష్టిలో పెట్టుకొని తనతో ఫైట్ సీన్ లో ఒక డైరెక్టర్ ఇతర ఫైటర్స్ ను దగ్గరగా ఎవరూ వెళ్ళొద్దని చెప్పినా సరే ఒకతను వచ్చేసరికి తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలి ముందున్న ఐదు పళ్ళు రాలిపోయాయని సుమన్ అన్నారు.కానీ అతనికి అప్పటికే అవి పెట్టుడు పళ్లే అని చెప్పారని అన్నారు.