Movies

అల వైకుంఠ‌పురంలో నటించిన టబుకి 15 నిమిషాలకు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?

చాలా కాలం త‌ర‌వాత తెలుగు తెర‌పై మెరిసింది ట‌బు. అల వైకుంఠ‌పుర‌మ‌లో ఓ రిచ్ మ‌మ్మీ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె క‌నిపించింది కాసేపే. ఆమె స్థాయికి త‌గిన పాత్ర కూడా కాదు. తాను మాత్ర‌మే చేయాల్సిన పాత్ర అస్స‌లు కాదు. కానీ.. ఏకంగా రూ.3 కోట్ల పారితోషికం ప‌ట్టుకెళ్లిపోయింద‌ట‌. ఔను… ఈ సినిమా కోసం ట‌బు అక్ష‌రాలా మూడు కోట్లు అందుకుంది. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా కోసం విజ‌య‌శాంతికీ అంతే ఇచ్చారు.

అయితే విజ‌య‌శాంతి పాత్ర అందులో చాలా కీల‌క‌మైన‌ది. ఆమె స్థాయికి త‌గిన పాత్రే క‌ట్ట‌బెట్టాడు అనిల్ రావిపూడి. కానీ అల వైకుంఠ‌పుర‌ములో విష‌యంలో మాత్రం అది జ‌ర‌గ‌లేదు. ట‌బు ని కేవ‌లం స్టేచ‌ర్ చూపించ‌డానికి వాడుకున్నార‌నిపిస్తుంది. త‌ను చ‌క్క‌గా ప‌ది రోజులు కాల్షీట్లు ఇచ్చి, ఏకంగా రూ.3 కోట్లు రాబ‌ట్టుకుంది. ఇన్నేసి డ‌బ్బులు ఇస్తారంటే, ఎవ‌రు మాత్రం కాదంటారు..?? ట‌బుకి మాత్రం వీర‌లెవిల్లో గిట్టుబాటు అయ్యింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."