Politics

నేను చేసిన పెద్ద తప్పు అదే అంటున్న బండ్ల గణేష్…జ్ఞానోదయం అయిందా?

బండ్ల గణేష్ అంటే గతంలో బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత అని పేరు ఉంది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం తీసాక బండ్ల గణేష్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే బండ్ల గణేష్ రాజకీయాల్లోకి రావడం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, లేకపోతె నా గొంతు కోసుకుంటా అని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే రాజకీయాల్లో అనుకున్నది అంత ఈజీ కాదని తెలుసుకొని, తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రం లో ట్రైన్ ఎపిసోడ్ సీన్స్ లో కనిపించారు బండ్ల గణేష్.

అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. “నాకు తెలిసి నేను చేసిన పెద్ద తప్పు రాజకీయాల్లోకి రావడం, నాకు తెలిసింది ఒక్కటే, సినిమా సినిమా సినిమా” అని పేర్కొన్నారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. జగన్ కూడా అలానే అనుకుంటే ఈరోజు మనం అతనిని ముఖ్యమంత్రిగా చూసే వాళ్లమా? ట్రై చేయాలి ఓపిగ్గా అంటూ బదులిస్తున్నారు. కొందరు పవన్ అభిమానులు గబ్బర్ సింగ్ లాంటి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వమని కోరుతున్నారు. ఏదేమైనా బండ్ల గణేష్ రాజకీయాల్లో వున్నపుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి ప్రజలు మరువలేకున్నారు.