Movies

వీళ్ళను తీసుకురమ్మని ఆలీకు వార్నింగ్స్ వచ్చాయంట.!

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే పలు ప్రోగ్రామ్స్ లో ప్రముఖ సినీ నటుడు మరియు కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కూడా ఒకటి.టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ షో ద్వారా తమ జీవితంలో అప్పటి వరకు జరిగిన పలు అంశాలను చర్చించారు.అయితే ఈ షో ను రెగ్యులర్ గా వీక్షించే ఆడియన్స్ కు అంటూ ఒక అభిరుచి ఉంటుంది కదా వాళ్ళకి నచ్చిన వ్యక్తులను కూడా తీసుకోం రమ్మని పదే పదే అడుగుతూ ఉంటారు కూడా.అలా ఒక ఎపిసోడ్ ను యూట్యూబ్ లో విడుదల చేసాక అందులో కామెంట్స్ కూడా చేస్తూ కొందరు సీనియర్ నటులను తీసుకు రావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు.

అలా రిక్వెస్ట్ చేసిన వారిలో ఒకరే టాలీవుడ్ యాక్షన్ హీరో సుమన్.నిన్న సోమవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ఆలీ ఈ విషయం పైనే మాట్లాడుతూ తమ వీక్షకులు ఎలా వార్నింగ్స్ ఇచ్చేవారో తెలిపారు.సుమన్ గారిని తీసుకొని రమ్మని తమకు లక్షలాది మెయిల్స్ వచ్చేవి అని ఒక్క సుమన్ గారి మీదనే కాకుండా లేడీ అమితాబ్ విజయ శాంతిని కూడా తీసుకొని రమ్మని చాలా మంది మొదట మెయిల్స్ లో రిక్వెస్ట్ చేసే వాళ్ళని కానీ తర్వాత తర్వాత “ఏ ఆలీ వీళ్ళని తీసుకురండి” అంటూ పంపడం మొదలు పెట్టారని దానితో ఇప్పటికి సుమన్ గారిని తీసుకొచ్చాం.మెల్లగా విజయ శాంతి గారు కూడా వస్తున్నారు అని ఆలీ ఒక క్లారిటీ ఇచ్చారు.