Movies

16 ఏళ్ల క్రితమే ప్రభాస్ పెళ్లి ఆ హీరోయిన్ తో జరిగి ఉండేది…కానీ ఎందుకు ఆగింది…!

డార్లింగ్ అని పలకరించి ఇండస్ట్రీలో బాహుబలిగా మారి,వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో దూసుకెళ్తున్నా ఎందుకో పెళ్లి విషయంలో ముందుకు వెళ్లడం లేదు. తన తోటి హీరోలకు పెళ్లిళ్లు అయిపోయి,పిల్లలు కూడా పుట్టినప్పటికీ తాను మాత్రం పెళ్లి ఊసెత్తడం లేదు. ఇంట్లో వాళ్ళు పెళ్లి అంటున్నా సరే, రెస్పాన్స్ లేదు. 41ఏళ్ళు వచ్చేసినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. బాహుబలి పూర్తయ్యాక పెళ్లి అని , రెండవ భాగం అయ్యాక అని,ఆతర్వాత సాహో అయ్యాక అని అన్నారే గానీ ప్రభాస్ పెళ్లి విషయం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.

ఇక జాన్ సినిమా అయ్యాక అంటున్నారు.మొన్న ప్రభాస్ పెద్దమ్మ కూడా జాన్ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి అని చెప్పారు. వయస్సు ముదురుతున్న వాయిదా మాత్రం ఆపడంలేదు. ఇక అతడి పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి మాట ఎత్తితే అప్పుడే తొందరేంటి అని తప్పించుకుంటాడు. జాన్ సినిమా అయ్యేసరికి మరో ఏడాది ఈజీగా పట్టేస్తుందని అందుకే ప్రభాస్ త్వరగా పెళ్లిచేసుకో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే 16ఏళ్ళ క్రితమే ప్రభాస్ పెళ్లి అవ్వాల్సి ఉందని ఈ మధ్య ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

25 ఏళ్ళ వయస్సులో అవ్వాల్సిన పెళ్లి 41ఏళ్ళు వచ్చినా అవ్వలేదంటే కారణం బలంగా ఉందట. సినిమా షూటింగ్ సమయంలో ఒక నటిని ప్రేమించిన విషయం చెబితే, కృష్ణరాజు ఒప్పుకోలేదని,ఆ నటితో మూడు సినిమాలు చేసాడని,ఆమెతో లవ్ సక్సెస్ కాకపోవడం వల్లే ఇప్పటికీ పెళ్లి ఊసెత్తడం లేదని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అన్నది చెప్పలేం. ఆ ఆమధ్య అనుష్కతో ప్రేమలో పడ్డాడని షోషల్ మీడియా కోడై కూసింది. కానీ మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాక కానీ ఈ రూమర్స్ తగ్గలేదు. మరి ప్రభాస్ తో 16 ఏళ్ళ క్రితం నటించిన హీరోయిన్ ఎవరు,పైగా ఆమె మూడు సినిమాలు చేసిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై నెటిజన్స్ వెతుకులాట ప్రారంభించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."