Business

TIK TOK గురించి ఎవరికి తెలియని నిజాలు

స్మార్ట్ ఫోన్ తో ప్రపంచం అరచేతిలోకి రావడమే కాదు,ఎన్నో ఫీచర్స్ కూడా రోజురోజుకి వచ్చేస్తున్నాయి. అయితే 2014లో అలెక్సో,లూయి లాంగ్ అనే వ్యక్తులు కల్సి ఒక ఎడ్యుకేషనల్ యాప్ అభివృద్ధిచేయాలని భావించారు. 2న్నర లక్షల పెట్టుబడి పెట్టి, ఆరునెలలు కష్టపడి వీడియో లాంచ్ చేసారు. అయితే పెద్దగా క్లిక్ కాలేదు. అయితే చిన్నగా ఉండడం కన్నా ఎడ్యుకేషన్ వీడియోస్ పెద్దగా ఉండాలని గమనించారు. అయితే అంతలా చేయాలంటే చాలా శ్రమ,ఖర్చు ఉంటాయి. అందుకే జీవితంలో ఎదగడానికి కొత్తగా ప్రయత్నం చేయాలనీ భావించారు.

ఒకరోజు ట్రైన్ లో సెల్ లో సెల్ఫీలు తీసుకుంటూ, సాంగ్స్ వింటూ ఎంజాయి చేయడం ఎలెక్స్లో గమనించాడు. దాంతో పాటలు,వీడియో,ఫోటోలను కలిపే సోషల్ యాప్ తయారుచేయాలన్న ఐడియా వచ్చింది. 15సెకన్స్ నుంచి ఒక నిమిషం లోపు సాంగ్స్,ఫోటో ఆధారంగా వీడియో రూపొందించుకునే యాప్ రూపొందించాడు. ఇది ఒక సోషల్ నెట్ వర్క్ గా మారిపోయింది. దీంతో అనతికాలంలోనే ఎలాంటి ప్రచారం లేకుండా ఈ యాప్ డవలప్ అయింది. ఎలెక్సో దగ్గర ఇప్పుడు కొత్త ఐడియాస్ కూడా ఉన్నాయట. వర్కర్స్ కూడా ఉండడంతో మ్యూజిక్ యాప్ లాంచ్ చేసారు.

ఈ ప్రాసెస్ లో టివి ప్రోగ్రాం చూస్తూ, సాంగ్ కి లిప్ మూవీ మెంట్ ఇవ్వడం ఎలెక్సో గమనించాడు. దాంతో యాప్ రూపొందించాడు. జనంలోకి వెళ్ళింది. అయితే ఈ యాప్ లో ప్రతి వీడియో మీద వాళ్ళ లేబెల్ వచ్చేలా మార్పులు చేసారు. దీంతో బాగా క్లిక్ అయింది. అన్ని యాప్ లను కలిపి ఒకేదానిలో సృష్టించడంతో 2015లో వచ్చిన ఈ యాప్ అనూహ్యంగా క్లిక్ అయింది. దీంతో వందకోట్లు పెట్టి ఓ చైనీస్ కంపెనీ కొనేసింది. అంతర్జాతీయ వెర్షన్ యాడ్ చేసి,టిక్ టాక్ అనే పేరు పెట్టారు. 50కోట్ల మంది యూజర్స్ మొదట్లో ఉండేవారు. వాట్సాప్ కి అనుసంధానంతో పాటు ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కూడా దీనిద్వారా చేస్తున్నారు. దీంతో కాసులు కురిపిస్తోంది టిక్ టాక్.