జబర్దస్త్ గెటప్ శ్రీను ఎంత ఆస్థి సంపాదించాడో తెలుసా?
బుల్లితెర కామెడీ షో గా అంత్యంత ప్రజాదరణ చూరగొన్న జబర్దస్త్ ఎందరో కళాకారులకు బతకడానికి వేదికగా నిల్చింది. ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి, సినిమా ఛాన్స్ లు అందిపుచ్చుకోడానికి కూడా ఈ ప్రోగ్రాం ఊతమిచ్చింది. అంతగా పాపులర్ అయిన జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను గురించి చెప్పగానే జూనియర్ కమల్ హాసన్ అని అంటారు. అంతగా పేరు తెచ్చుకున్నాడు.
సుడిగాలి సుధీర్ టీమ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా రోజుకో కొత్త గెటప్ తో జబర్దస్త్ అభిమానులను గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్విస్తాడు. సినిమా యాక్టర్లను అనుకరిస్తూ నటించే యితడు ఇప్పటికే పలు సినిమాల్లో మంచి రోల్స్ వేసాడు. కష్టపడే తత్వంతో ఇప్పటికే ఎందరో అగ్ర హీరోల నుంచి మన్ననలు అందుకున్నాడు. జబర్దస్త్ చేస్తూ సినిమాల్లో చేస్తున్నాడు.
అయితే గెటప్ శ్రీను ఏడాది కి ఎంత సంపాదిస్తున్నాడు,అతడి ఆస్తివిలువ ఎంత,ఒక్కో ఎపిసోడ్ కి ఎంత అందుకుంటాడు వంటి వివరాల్లోకి వెళ్తే, ఏడాదికి 45నుంచి 55లక్షలు సంపాదిస్తాడు. ఇందులో జబర్దస్త్ నుంచి 20నుంచి 25లక్షలు సంపాదిస్తాడు. అలాగే సినిమాల్లో వేసే పాత్రలకోసం 15నుంచి 20లక్షలు డిమాండ్ చేస్తాడట. అయితే మణికొండలో ఓ ఖరీదైన ఇల్లు, ఒక స్పోర్ట్స్ కారు తీసుకున్నాడు.