సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి మీకు తెలియని విషయాలు
సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వేసి, బుల్లితెరమీద కూడా యాంకరింగ్ తో అదరగొట్టిన సురేఖా వాణి అందరికీ తెల్సిందే. ఎన్నో క్యారెక్టర్స్ తో తానేమిటో నిరూపించుకుంది. ఇక ఈమె కూతురు సుప్రితా నాయుడు చదువుకుంటూనే మరోపక్క వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆమె చేసిన సిరీస్ యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది. తల్లి మాదిరిగానే తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని దూసుకెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా సురేఖా వాణి భర్త సురేష్ తేజ ఈమధ్య కన్నుమూశారు. దీంతో తీరని వేదనకు గురైన సురేఖకు తానున్నానని ధైర్యం చెబుతూ కూతురు సుప్రీతా నాయుడు అండగా నిలబడింది. కేవలం 19ఏళ్ళ ప్రాయంలోనే తల్లికి అండగా నిల్చిన సుప్రీతా నాయుడు తన తండ్రి మరణించినపుడు తానె తలకొరివి పెట్టడం అప్పట్లో సంచలనం అయింది. ఒక్కర్తే కుమార్తె కనుక ఆమె అలా చేసింది.
అయితే సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ వేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంది. ‘మా జీవితాల్లో మేము ఎంతగా సఫర్ అవుతూ గడుపుతున్నామో మీకు తెలీదు అంటూ గట్టిగానే సుప్రీతా స్పందించింది. వెకేషన్ టైం లో తల్లితో సరదాగా ఎక్కడికైనా వెళ్తూ తల్లితో టైం స్పెండ్ చేస్తోంది.

