ఈ ఫోటోలోని ముద్దుగుమ్మను గుర్తుపట్టగలరా?
కొందరు హీరోయిన్స్ తమకున్న గ్లామర్ తోనే అదరగొట్టేస్తూ దూసుకెళ్తుంటే మరికొందరు ఒక సినిమాకి మరోసినిమాకు అందంలో ,గ్లామర్ లో తేడా కొట్టిచ్చినట్లు చూపిస్తూ,అందుకు అనుగుణంగా మార్పులు కూడా చేయించుకుంటారు. ఇక కొందరు సినిమాల్లో రాకముందు ఉండే పొజిషన్ కి వచ్చాక ఉండే పొజిషన్ కి అసలు పోలికే ఉండదు. అంతలా మారిపోతారు. హీరోయిన్ అనే ముద్ర పడ్డాక వాళ్ళ దశ మారిపోతుందని అంటారు.
తెలుగు తమిళ భాషల్లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న నయనతార ఒకప్పుడు ఎలా ఉండేదో చూస్తే నోరెళ్లబెడతారు. కాలేజీలో స్టడీస్ టైం లో ఆమె తీయించుకున్న ఫోటోకి ఇప్పటికీ అసలు ఏమాత్రం పోలికే ఉండదు. ఇక చంద్రముఖి లో నటించకముందు ఆమె ఫోటో చూస్తే ఇంకా కంగుతింటాం.
ముద్దుగా బొద్దుగా బుగ్గలతో ఉండే నయనతార తర్వాత సినిమాల్లో ఒకదానికొకటి పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ వస్తోంది. ఒక దాని తర్వాత మరో సినిమా హిట్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగి,హయ్యెస్ట్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది. ఇలా ఇంకా కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు.

