Movies

హీరోగా ఎంట్రీ ఇస్తున్న తేజ కొడుకు…చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడో..?

చిన్నప్పుడే తల్లిని కోల్పోయి ఇల్లు వదిలేసి చెన్నై చేరుకొని అష్టకష్టాలు పడుతూ సినీ డైరెక్టర్ అయిన తేజ గురించి చెప్పాలంటే అతడిది విలక్షణ శైలి. అతడికి భార్య శ్రీవల్లి, కొడుకు అమితవ్ తేజా, కూతురు ఐలా తేజ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తన పిల్లలకు ఆస్తులు ఏమీ ఇవ్వనని, చదువు చెప్పిస్తానని అయితే వాళ్లకేం కావాలో వాళ్ళంతట వాళ్ళే సంపాదించుకోవాలని డైరెక్టర్ తేజ చెబుతుంటాడు.కూతురు అమెరికాలో చదువుతుంటే, ముంబయిలో 1995లో జన్మించిన కొడుకు అమితవ్ హీరో కావడానికి రెడీ అవుతున్నాడు. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఓ సినిమా చేయడానికి ప్రకటన చేసినా ఎందుచేతనో అది సెట్స్ మీదికి రాలేదు.

రామ్ గోపాల్ వర్మ దగ్గర, పెద్ద పెద్ద సంస్థల దగ్గర తేజ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూ,హైదరాబాద్ లో రామోజీరావు కంటిలో పడడంతో చిత్రం మూవీతో డైరెక్టర్ గా ఛాన్స్ కొట్టేసాడు. 2000లో విడుదలైన ఈ మూవీ ఘన విజయం అందుకుంది. అందులో అమితవ్ చైల్డ్ ఆర్టిస్టుగా తన సత్తా చాటాడు. ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకున్న అమితవ్ బాక్సింగ్ లో కూడా ప్రావిణ్యం సాధించాడు.

చదువు కొనసాగిస్తూనే, నిజం సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక గోవిందుడు అందరివాడేలే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన అమితవ్ ఈమధ్య ఓ షార్ట్ ఫిలిం కి డైరెక్షన్ చేసాడు. కాలిఫోర్నియాలో ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ ప్రోగ్రాం లో గ్రాడ్యుయేషన్ లో చేరినప్పటికీ మొదటి సెమిస్టర్ లోనే డ్రాప్ అవుట్ అయ్యాడు. నటనలో శిక్షణ కోసం న్యూయార్క్ కి వెళ్లిన అమితవ్ అక్కడ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందాడు. మోషన్ పిక్చర్స్ ఎగ్జిబిషన్ కంపెనీకి, జయం మూవీస్ ప్రయివేట్ లిమిటెడ్ కి,చిత్రం మూవీస్ కి సీఈఓ గా ఉంటున్నాడు.