Movies

ఏ హీరోయిన్ సాధించలేని ఘనత సాధించిన సాయి పల్లవి

ఒక్కో రంగంలో ప్రగతి గురించి ఎప్పటిపైకప్పుడు తెలియజేయడానికి కొన్ని మేగజైన్స్ ఉన్నాయి. అలాగే ప్రపంచంలో వివిధ రంగాలలో సంపన్నులు, అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న వారి జాబితాని ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది.అయితే ఈ ఫోర్బ్స్ జాబితాలో వచ్చిన వారి పేర్లు చూస్తే ఒక్కో సారి ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని సందర్బాల్లో ఇది తప్పని చెప్పినవాళ్ళూ ఉన్నారు. నోరు మెదపని వాళ్ళూ ఉన్నారు. అయితె తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ మరో సారి సంపన్నుల జాబితా ప్రకటించింది.

ఈసారి 30 ఏళ్ల లోపు ఇండియా యూత్ లో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న 30 మంది తో కూడిన జాబితాలో చాలా మంది ప్రముఖులు, యువ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.అలాగే యుట్యూబ్ స్టార్స్ కూడా ఉన్నారు.అయితే ఊహించని విధంగా ఇండియన్ సినిమా నుంచి ఈ జాబితాలో సౌత్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవికి చోటు దక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఫోర్బ్స్ జాబితాలో 15వ స్థానం దక్కింది.ఈమె సినిమాలు తక్కువ చేసిన ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని.ఈ కారణంగా ఈమె ఆదాయం ఇతర హీరోయిన్స్ తో పోల్చుకుంటే ఎక్కువగా ఉందట.

ప్రస్తుతం తెలుగులో సాయిపల్లవి రెండు సినిమాలు చేస్తోంది. .ఆ రెండు కూడా ఎవరేజ్ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉన్న సినిమాలే ఏడాదిలో ఈ అమ్మడి ఆదాయం దాదాపుగా 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా ఉన్న పూజా హెగ్డే, అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న యంగ్ హీరోయిన్స్ కంటే సాయి పల్లవి ఎక్కువగా కూడబెడుతోందంటే సహజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. దీనిపై ఈ ముద్దుగుమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.