రజనీకాంత్ కు దర్బార్ సినిమా గట్టిగానే తగిలింది…పారితోషికం అంత తగ్గిందా…?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు దర్బార్ సినిమా గట్టిగానే తగిలింది. ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్, కలెక్షన్స్ పక్కనపెడితే…. తమిళనాట ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 70 కోట్ల మేర నష్టపోయారట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లు వసూలు చేసిందని అన్నారు.

కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలతో రోడెక్కారు. తాజాగా దర్బార్ దెబ్బతో రజనీకాంత్ తన పారితోషికాన్ని సగానికి తగ్గించేశారు అనే వార్తపై కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రజనీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మీనా, ఖుష్భు, నయనతార, ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా నిర్మాత కళానిధి మారన్ రజని షూటింగ్ స్పాట్ లో కలసి తను నిర్మించిన దర్బార్ సినిమా మిగిల్చిన భారీ నష్టాల గురించి వివరించి….

ప్రస్తుతం చేస్తున్న సినిమాకు పారితోషికం తగ్గించుకోవాల్సిందిగా కోరాడట. దీనికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘దర్బార్’ మూవీకి రజనీకాంత్ రూ.116 కోట్లు (GSTతో కలిపి) తీసుకున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు సగం అంటే రూ.58 కోట్లు (GSTతో కలిపి) మాత్రమే అందుకోనున్నారు. నిర్మాత శ్రేయస్సు కోరుతూ సూపర్ స్టార్ తీసుకున్న నిర్ణయానికి తలైవా అభిమానులు ఆయణ్ణి అభినందిస్తున్నారు.