Movies

జబర్దస్త్‌కి షాకివ్వనున్న అనసూయ!ఇందులో నిజం ఎంత…???

బుల్లితెరఫై సక్సెస్‌ఫుల్‌ ఎంటర్టైన్మెంట్ షోగా రన్‌ అవుతున్న జబర్దస్త్‌లో ఈ మధ్య చాలా మార్పు చేర్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షోకి పెద్దన్న అయిన నాగబాబు సడెన్‌గా షో నుండి తప్పుకోవడంతో జబర్దస్త్‌ రెపిటేషన్‌ పడిపోతుందని భావించారంతా. కానీ, పూర్తి బాధ్యతను తన భుజ స్కంధాపై వేసుకుని రోజా మేడమ్‌ ఈ షోని బాగానే కంటిన్యూ చేసేస్తున్నారు. మొదట్లో ఒకటి రెండు షోల్లో నాగబాబు లేని లోటు కనిపించినా ఆ తర్వాత ఆ లోటు తెలియకుండా షోని నడిపించేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ షోపై మరో రూమర్‌ తెరపైకి వచ్చింది. అందాల భామ యాంకర్‌ బొమ్మ అనసూయ కూడా షో నుండి తప్పుకోనుందనేది ఆ రూమర్‌ సారాంశం.

సోషల్‌ మీడియాలో ఈ వార్త గుప్పుమని సర్క్యులేట్‌ అవుతోంది. అయితే, రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే అనసూయ ఈ రూమర్‌పై ఇంతవరకూ స్పందించలేదు. ఎంత బిజీగా ఉన్నా జబర్దస్త్‌ని వదిలేని లేదని గతంలో పలు మార్లు అనసూయ చెప్పడం విన్నాం. అఫ్‌కోర్స్‌.. నాగబాబు నుండి కూడా ఇదే సమాధానాన్ని చాలా సార్లు విన్నాం. కానీ, ఆయనే తప్పుకున్నప్పుడు అనసూయ ఎంత.? ఈ నేపధ్యంలో ఒకవేళ అనసూయ కాకుంటే, ఆ ప్లేస్‌ని రీప్లేస్‌ చేసే అందమైన యాంకరమ్మ ఎవరు.? అనే అంశాలు ప్రస్తుతానికి చర్చకొస్తున్నాయి.

జబర్దస్త్‌కి పోటీగా జీ ఛానెల్‌లో ప్రారంభమైన నాగబాబు ‘అదిరింది’ షోకి యాంకరమ్మ పెద్ద మైనస్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. అలా కాకుండా, ఒకవేళ అనసూయ అవుట్‌ అయితే, ఇన్‌ అయ్యే ముద్దుగుమ్మ అనసూయ రేంజ్‌లో అందాల ఆరబోతకు సై అనేలా ఉండాలి. మంచి టైమింగ్ కూడా ఉండాలి .. అంటూ నెటిజన్స్‌ ముందుగానే తమ అభిప్రాయాు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి, ఈ రూమర్‌లో నిజమెంతో.