Politics

పవన్ కళ్యాణ్‌కి కోలుకోలేని దెబ్బ.. జనసేనకు కీలకనేత రాజీనామా..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖపట్నానికి చెందిన మరో కీలక నేత జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇటీవల ఆ పార్టీలో కీలకంగా ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీనీ వీడిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో నచ్చక లక్ష్మీ నారాయణ పార్టీనీ వీడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

అయితే ఈ షాక్ నుంచి కోలుకోకముందే పవన్‌కి గాజువాకలోని మరో కీలక నేత షాక్ ఇచ్చారు. గాజువాక జనసేన సీనియర్‌ నాయకుడు కరణం కనకారావు నేడు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరిపోయారు. అయితే కనకరావుతో పాటు దాదాపు వంద మంది జనసైనికులు వైసీపీ కండువా కప్పుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."