చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్న రాజమౌళి…కారణం ఇదేనా…?
తెలుగు సినిమాల్లో పాన్ ఇండియా కేటగిరీలో తీసే సినిమాలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్నందున ప్రమోషన్ వర్క్ లోనే కాదు,రిలీజ్ విషయంలో కూడా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాలన్నీ మెగాస్టార్ చిరంజీవిపై ఆర్ ఆర్ ఆర్ మూవీ డైరెక్టర్ జక్కన్న వత్తిడి తెచ్చేలా చేస్తున్నాయట. ఇప్పటికే ఈ మూవీ డేట్ ని 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8కి వాయిదా వేసేసారు. దీంతో పలు మూవీస్ షెడ్యూల్స్ కూడా మారిపోయాయట. కన్నడ రాక్ స్టార్ యాష్ నటిస్తున్న కెజిఎఫ్ 2మూవీ కోసం బాహుబలి రిలీజ్ చేసిన జులై 30వ తేదీనే ఖరారు చేసాడట.
ఇక మెగాస్టార్ చిరంజీవి,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకున్నా,ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టులోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నారట. అందుకే వేగంగా ఈ సినిమా చేస్తున్నారు. అయితే 2021వేసవిలో విడుదల చేయాలని రాజమౌళి వత్తిడి తెస్తున్నాడట. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఉండడమే కారణం. అంతేకాదు,చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ నటించే ఏ ఇతర సినిమా అయినా సరే,ఆర్ ఆర్ ఆర్ తర్వాతే రిలీజ్ చేయాలనీ జక్కన్న కండిషన్ పెట్టేసాడట.
ఇక చిరు,కొరటాల కాంబోలో వచ్చే మూవీలో చరణ్ 40నిముషాల నిడివి పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో చిరుపై వత్తిడి మరింత హెచ్చింది. 2020ఆగస్టుకి,2021 సంక్రాంతికి చాలా సమయం తేడా ఉన్నప్పటికీ జక్కన్న వత్తిడి ఎందుకు తీస్తున్నాడా అని అందరూ చర్చింకుంటున్నారు. అసలు టెన్షన్ దేనికి అని ప్రశ్నలు వస్తున్నాయి. మరి జక్కన్న దీనికి కారణం చెప్పాలి. మరోపక్క చిరు,కొరటాల మూవీ షూటింగ్ హైదరాబాద్ కోకా పేట సెట్స్ లో వేగంగానే సాగుతోంది. యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఇక రెజీనా పాట షూటింగ్ కూడా పూర్తయిందట.

