Movies

బన్నీ మూవీ బాలీవుడ్ లో రీమేక్.. హీరో ఎవరో తెలుసా ?

రీమేక్ ఏ భాషనుంచి ఏ భాషకైనా ఈజీగా అయిపోతున్నాయి. అయితే ఇటీవల వరుసగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్లు బాలీవుడ్ సహా ఇరుగు పొరుగు భాషల్లోనూ రీమేకై ఘనవిజయం సాధిస్తున్నాయి. అందుకే హిందీ మార్కెట్లో తెలుగు సినిమా కథలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ `కబీర్ సింగ్`క్రియేట్ చేసిన సంచలనం ఏ రేంజ్ లో ఉందొ తెలుసుకదా. ఇక తెలుగులో విమర్శకుల ప్రశంసలు పొందిన జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కబీర్ సింగ్ ఫేం షాహిద్ కపూర్ ఈ చిత్రం లో కథానాయకుడి గా నటిస్తున్నారు.

అలాగే తెలుగు-తమిళం లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కాంచన చిత్రాన్ని అక్షయ్ ప్రధాన పాత్రలో లారెన్స్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి బరిలో క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `అల వైకుంఠపురములో` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెడీ అవుతున్నట్లు టాక్. అయితే హిందీ రీమేక్ లో హీరో ఎవరు? దర్శకుడెవరు? అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. అక్కడ ఎవరు నటిస్తే బావుంటుంది? అన్నదానిపై ప్రస్తుతం లోతుగా చర్చిస్తున్నారట.

అల్లు అరవింద్ బాలీవుడ్ లోనూ ఫేమస్ నిర్మాత. `గజినీ` రీమేక్ ని అదే టైటిల్ తో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. అక్కడ తొలి 100 కోట్ల క్లబ్ సినిమా అరవింద్ తీసాడని చెప్పొచ్చు. ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ ని దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తుండగా, అమీర్ ఖాన్ సహా బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కూడా అరవింద్ కి సాన్నిహిత్యం ఉంది. ఆ క్రమంలోనే అల వైకుంఠపురము లో హిందీ రీమేక్ కి ఏ స్టార్ ఓకే చెబుతారు? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."