Movies

గౌతమ్ కృష్ణ – అకిరా నందన్ ల మధ్య ఉన్న ఈ పోలికలు చూస్తే షాక్ అవుతారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల తనయుడు అకిరా నందన్,సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ ల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తాయి. మెగాస్టార్ సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎన్నో హిట్స్ తో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అలాగే తెలుగులో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చినా, కొత్త ప్రయోగాలు చేసినా తనకే చెల్లిందని చాటిన సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి తండ్రని మించి తనయుడిగా నిలిచాడు. ఇక కృష్ణ ఫ్యామిలీలో మూడవ తరం హీరోగా మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ ను ఎంట్రీ ఇప్పించడానికి అనువుగా తీర్చిదిద్దుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వన్ నేనొక్కడినే మూవీద్వారా ఇప్పటికే వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.

ఇక అకిరా నందన్ ని తీసుకుంటే,ఆరేళ్ళ వయసులోనే ఓ మరాఠీ మూవీలో ఎంట్రీ ఇచ్చాడు. మెగా ఫామిలీ నుంచి అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. 2006 ఆగస్టు 31న హైదరాబాద్ లో పుట్టిన గౌతమ్ కృష్ణ ఇప్పటికే 13వ పుట్టినరోజు జరుపుకున్నాడు. తండ్రి తరపున,తల్లి తరపున కూడా బలమైన సినీ నేపధ్యం ఇతడికి ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మహేష్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అలాగే కృష్ణ సోదరులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతేకాదు గౌతమ్ తల్లి నమ్రత మాజీ మిస్ ఇండియా మోడల్,అగ్ర నటిగా కూడా రాణించింది. ఇవన్నీ చూస్తే వెండితెరపై లవర్ బాయ్ గా గౌతమ్ వెండితెరపై కనిపించబోతున్నాడని చెప్పవచ్చు.

తండ్రికి తగ్గ తనయునిగా మంచి పర్సనాల్టీతో ఆరడుగుల పొడుగు తో తయారవుతాడని గౌతమ్ ని చూస్తే చెప్పొచ్చు. ఇక అకిరా 2004ఏప్రియల్ 8న పుట్టాడు. ఇటీవలే 17వ పుట్టినరోజు చేసుకున్నాడు. మహేష్,నమ్రత మాదిరిగా పవన్,రేణు కూడా హీరో హీరోయిన్స్ కావడం విశేషం. ఇక వంశీ సినిమాలో నటించి ప్రేమలో పడి మహేష్,నమ్రత పెళ్లాడినట్లే,పవన్ , రేణు కూడా బద్రి సినిమాలోనే ప్రేమలో పడి, నాలుగేళ్లపాటు ప్రేమ సాగించారు. 2004లో అకిరా కు జన్మనిచ్చారు. 2009లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2011లో ఓ పాపకు జన్మనిచ్చారు. ఆతరవాత పవన్ తో విడిపోయి ,పూణేలో పిల్లలతో ఉంటూ సొంత సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేస్తోంది. గౌతమ్ తల్లి నమ్రత మరాఠీ కాగా, అకిరా తల్లి రేణు గుజరాతీ. ఇద్దరూ నాన్ తెలుగువాళ్లే కావడం విశేషం. అయితే అకిరా హైదరాబాద్ ఎప్పుడొచ్చినా చిరంజీవి,పవన్,రామ్ చరణ్,నిహారికా ఇలా అందరిని కల్సి వెళ్తాడు. పవన్ కూడా పిల్లల పుట్టినరోజులు పూణే వెళ్లి ఆశీర్వదించి వస్తాడు. అందుకే అకీరాకు బలమైన మెగా ఫామిలీ ఉంది.