చూయింగ్ గమ్ తో బరువు తగ్గండిలా..!
అధిక బరువుతో బాధపడుతున్న వారు తమ బరువుని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అతి సులువుగా తమ బరువుని తగ్గించుకునేందుకు చూయింగ్ గమ్ ఎంతగానో ఉపయోగపడుతుందట. ఎలా అంటే? ఆకలిగా ఉన్నప్పుడు వారు చూయింగ్ గమ్‌ను తింటే ఆకలి చచ్చిపోతుందట. ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆకలి చచ్చిపోవడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా శరీరానికి అందే క్యాలరీలు కూడా తగ్గుతాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. కాకపోతే ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ చూయింగ్ గమ్‌ను నమలడం వల్ల ఒత్తిడి తగ్గుతుందన్న విషయం గతంలో నిర్వహించిన పలు పరిశోధనల్లో స్పష్టమైంది. టెన్షన్, ఆందోళన, ఒత్తిడిగా ఉన్న సమయంలో చూయింగ్ గమ్‌ను తింటే వెంటనే ఆ పరిస్థితి నుంచి బయట పడవచ్చని పరిశోధకులు అంటున్నారు. చూయింగ్ గమ్‌లను తినడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుందనీ, ఏకాగ్రతగా పనిచేస్తారని 2004లో చేసిన పరిశోధనల్లో వెల్లడైంది.