Movies

నేచురల్ స్టార్ నాని “V” సినిమాలో నెగిటివ్ రోల్ చేయటానికి కారణం ఇదేనట

నటించే కొద్దీ ఇంకా ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. లేకపోతె నటనపై కసి రాదు. అందుకే ఏ హీరో అయినా తన ల్యాండ్ మార్క్ సినిమా విభిన్నంగా ఉండాలనే కోరుకుంటాడు. ఆ సినిమా నుండి కొత్త జర్నీ కి బాట వేసుకోవాలని చూస్తాడు. సరిగ్గా నేచురల్ స్టార్ నాని ఇప్పుడు అదే చేస్తున్నాడు. లిస్టులో చాలా మంది దర్శకులన్నా ఇంద్రగంటి మోహన కృష్ణ చెప్పిన క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిపోయాడు. సరిగ్గా తన 25 సినిమా ఎలా ఉండాలనుకున్నాడో అలాంటి స్క్రిప్ట్ రావడంతో వెనకా ముందూ చూడకుండా ఒకే చేసేసాడు.

అయితే నాని కథ విన్నప్పుడు సినిమాలో రోల్ చాలా చిన్నది. కాకపోతే నెగిటివ్ రోల్ కావడంతో నటుడిగా ఇంకా మెరుగు పడే అవకాశం ఉందని ఒప్పేసుకున్నాడు. కానీ షూటింగ్ కెళ్ళే సరికి కథలో మార్పులు జారిగాయి. నాని క్యారెక్టర్ కి స్క్రీన్ స్పేస్ పెంచేశారట. మొదట షూట్ చేసిన సన్నివేశాలు బాగా రావడం పైగా నాని 25 సినిమా అవ్వడంతో గెస్ట్ రోల్ లా ఉండకూడదని దర్శకుడు నిర్మాత కథలో మార్పు చేశారట.

మొత్తం మీద ఫైనల్ గా నాని క్యారెక్టర్ పెరిగి సినిమాకు కీలకం అయింది. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ చూస్తే నాని అసలు ఈ సినిమా ఎందుకు చేసాడో, క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. మరి తన విలనీ క్యారెక్టర్ తో నేచురల్ స్టార్ మెప్పించి నిజంగానే ఈ సినిమాను స్పెషల్ గా మార్చుకుంటాడా అనేది అప్పుడే చెప్పలేం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా మార్చ్ 25 విడుదల కానుంది.